తెలంగాణ

4 రోజుల్లో నాలుగో సారి టెన్త్ పేపర్ లీక్.. ఏడుగురు అరెస్ట్

తెలంగాణలో వరుసగా నాలుగోసారి 10వ తరగతి పేపర్ లీక్ అయింది. 4 రోజుల్లో నాలుగో సారి పేపర్ లీక్ కావడం కలకలం రేపుతోంది.పరీక్షలు నిర్వహించడంలో దారుణంగా విఫలమైంది విద్యాశాఖ. తాజాగా జుక్కల్‌లో 10వ తరగతి గణిత ప్రశ్నాపత్రం లీక్ కావడంతో కేసు ఫైల్ చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.నకిరేకల్, మంచిర్యాల, వికారాబాద్ పేపర్ లీక్ ఘటనలు మరువక ముందే జుక్కల్ లో మరోసారి 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయింది.

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి గణితం పేపర్ లోని ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారువాటికి సంబంధించిన సమాధానాల చిటీలు కూడా సెంటర్ లోని విద్యార్థులకు అందజేసి మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. పేపర్ లీక్ సంబంధించిన వార్త అంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా విచారణ జరిపిన అధికారులు నిజమని నిర్ధారించారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆపీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు

కొందరు ఉపాధ్యాయులు తమ పాఠశాలలో 100 శాతం ఫలితాలు సాధించేందుకు, ఇలా ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు బయటకు పంపి మాస్ కాపీయింగ్ కు పాల్పడేలా చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఓ విద్యార్థి తండ్రి, పాఠశాలలోని వాటర్ మ్యాన్‌తో కలిసి ప్రశ్నలు లీక్ చేసి చిట్టీలు పంపగా, ఈ విషయం తెలుసుకున్న కొంతమంది మీడియా ప్రతినిధులు ఆ ప్రశ్నలు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.ఈ వ్యవహారంలో ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు మీడియా ప్రతినిధులు, విద్యార్థి తండ్రి, వాటర్ మ్యాన్, జీపీ కారోబార్ మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి .. 

  1. కదలుతున్న రైలులో అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్

  2. ఐదుగురు నన్ను లైంగికంగా వేధించారు- కన్నీరుపెట్టుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌

  3. బిర్యానీ సెంటర్‌ లో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా బయటపడ్డ వస్తువులు!

  4. సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు.. సూర్యాపేట జిల్లాలో దారుణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button