
పదోతరగతి ప్రశ్నపత్రాన్ని లీక్ చేశారు. విషయం తెలియడంతో పేపర్ లీక్ వ్యవహారంలో ముగ్గురుని సస్పెండ్ చేశారు డీఈవో. అయితేసస్పెండ్ చేసిన డీఈవోకు బెదిరింపులు వస్తున్నాయి. సైలెంట్ గా ఉండాలని.. పేపర్ లీక్ వ్యవహారంలో చూసి చూడనట్లు ఉండాలని చెప్పారు. లేదంటే అంతు చూస్తామని హెచ్చరించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో వెలుగు చూసింది
పదోతరగతి విద్యార్థులకు గణితం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల వ్యవధిలో వాట్స్‌ప్ లో దర్శనమిచ్చింది ప్రశ్నపత్రం. ఓ వ్యక్తి నేరుగా డీఈవో షంషుద్దీన్ కు సమాచారం చేరవేయడంతో ఆయన ఆ ప్రశ్నపత్రంలోని క్యూఆర్ కోడ్ ఆధారంగా వల్లూరు జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినట్లుగా గుర్తించారు. వల్లూరు మండలంలో ఒకటి, వేంపల్లె మండలంలో రెండు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అండతో ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం
Also Read : సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు.. సూర్యాపేట జిల్లాలో దారుణం
పరీక్ష మొదలైన నిమిషాల వ్యవధిలో వల్లూరు పరీక్ష కేంద్రంలోకి వాటర్ బాయ్ సాయిమహేష్, విఘ్నేశ్వర రెడ్డి అనే ఉపాధ్యాయుడు వెళ్లి ప్రశ్నపత్రం ఫొటో తీసి, వాట్స్‌యాప్ ద్వారా వేంపల్లెలోని కొంతమంది ప్రైవేట్ పాఠశాల యాజ మాన్యాలకు చేరవేస్తున్నారని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. పశ్నపత్రం లీకు వ్యవహారంలో చీఫ్ సూపరింటెండెంట్ ఎం.రామ కృష్ణమూర్తి, డిపార్ట్మెంటల్ అధికారి ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఇన్విజిలేటర్ ఎం. రమణను సస్పెండ్ చేశారు డీఈవో షంషుద్దీన్
ముగ్గురిని సస్పెండ్ చేయంతో డీఈవోపై బెదిరింపులకు దిగారు కొందరు వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేయడం, విచారణ వంటి వాటిపై తాము రాజకీయంగా చూసుకుంటా మని, ఇంతటితో విద్యాశాఖ సైలెంట్ అవ్వాలని హెచ్చరించారు. లేకపోతే జిల్లావిద్యాశాఖ అధికారులే లక్ష్యంగా ముందుకెళతామని హెచ్చరికలు జారీచేసినట్లు సమాచారం.