తెలంగాణ

వారం రోజుల్లో నిండనున్న శ్రీశైలం.. మరి సాగర్ పరిస్థితి ఏంటి?

Projects Inflow Updates: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆయా ప్రాజెక్టులలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయాల నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది. కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 317.47 మీటర్ల స్థాయిన మెయింటెయిన్ చేస్తూ 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా 59, 625 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,452 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

శ్రీశైలంలోకి భారీగా ఇన్ ఫ్లో  : జూరాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి  83,228 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు  మొత్తం నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 164.75 టీఎంసీలకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 875.2 అడుగులకు చేరుకుంది. తెలంగాణ పరిధిలోని ఎడమ గట్టు  కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 35,315 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో ఇలానే కొనసాగితే… వారం రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.

నాగార్జున సాగర్ లోకి 60, 576 క్యూసెక్కులు : అటు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ లోకి 60, 576క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 5,324 ఔట్ ఫ్లో ఉంది.  ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 517 అడుగులకు చేరింది. ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 143.86 టీఎంసీలు ఉన్నాయి.

జూరాలకు భారీ ఇన్ ఫ్లో : అటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జురాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఈ ఏడాది జూన్ నెలలోనే ఈ స్థాయి జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు 90,077 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.  అయితే క్రస్ట్ గేట్లు తెగిపోవడం వల్ల ఈ ఏడాది జలాశయంలో 80 టీఎంసీలకు మించే నీటిని నిల్వ చేయలేమని అధికారులు తెలిపారు.

తుంగభద్రకు ముందుగానే జల సందడి :  అటు కర్నాటక, ఏపీకి కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టుకు ఈసారి ముందుగానే జలకళ వచ్చింది. సాధారణంగా జూన్ నెలలో జలాశయం పూర్తిగా నిండడం చాలా అరుదు.  కానీ, 2017 తర్వాత ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ముందుగానే తుంగభద్ర జలాశయం నీటితో నిడిపోతుంది. ప్రస్తుతం జలాశయంలో 74 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.

కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం : అటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ దగ్గర గోదావరి నీటిమట్టం 16.17టీఎంసీల సామర్థ్యం కాగా, మరమ్మతుల కారణంగా గతేడాదిగా 85గేట్లు తెరిచే ఉంచుతున్నారు. ప్రస్తుతం 12,600 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుంది. అంతే మొత్తంలో కిందికి వదులుతున్నారు. మేడిగడ్డ దగ్గర 8 గేట్లు ఎత్తివేయడంతో పెద్దంపేట లంకలగడ్డ కింది ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read Also: ఏపీలో ఐదు రోజులు వానలు.. ఆ జిల్లాలో భారీ వర్షాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button