
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువగా రావడంతో ఈ కొద్ది రోజుల క్రితం డ్యామ్ గేట్లు ఎత్తిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే నేడు శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద భారీగా తగ్గడంతో నీటిని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు అన్ని గేట్లు కూడా నేడు అధికారులు మూసివేశారు. దీంతో ఎంతో ఆత్రుతగా నీరు విడుదలవుతున్న డ్యామ్ గేట్లను చూడడానికి వచ్చినటువంటి టూరిస్టులు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల ప్రయాణికులు అందరూ కూడా తిరిగి వాళ్ళ యొక్క స్వగృహాలకు పయనమయ్యారు. దాదాపు నిన్నటి వరకు కూడా శ్రీశైలంలో కొలువైయున్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి కూడా లక్షల్లో భక్తులు క్యూ కట్టి దర్శనాలు చేసుకున్నారు. శ్రీశైలం డ్యామ్ గేట్లు చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా… తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి కచ్చితంగా వెళ్తారు.
కానీ నేడు అన్ని గేట్లు బంద్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇళ్లకు తిరిగి బయలుదేరుతున్నారు. రెండు రోజుల క్రితం శ్రీశైలం నల్లమల అడవి రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఆయన ప్రచారాలను మనం వార్తల్లో చూసే ఉన్నాం. కానీ నేడు ఆ ట్రాఫిక్ జామ్ అనేది అంతగా కనిపించడం లేదు. శ్రీశైలం డ్యాం గేట్లను మూసివేసిన అధికారులు పలు క్యూసెక్కుల నీటిని వివిధ రకాలుగా విడుదల చేస్తున్నారు. జూరాల మరియు సుంకేసుల నుంచి 65 వేల 985 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి భారీగా వస్తుంది. దీంతో తుడి మరియు ఎడమజాల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,247 క్యూ సీట్లు నీరు సాగర్ కు అలాగే 20వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడుకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా , నేడు 882.50 అడుగుల నీరు ఉంది.
అంధత్వం ఉన్న… వీరి గానం మాత్రం అద్భుతం! కూసింత పట్టించుకోండి?