
Srisailam Dam Gates Open: ఎగువన నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం గేట్లు ఓపెన్ చేశారు. రైతులతో కలిసి నాలుగు గేట్లు ఓపెన్ చేసి నీటిని సాగర్ కు విడుదల చేశారు. 6,7,8,11 నంబర్ గేట్స్ ఎత్తారు. కృష్ణమ్మ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పరవళ్లు తొక్కుతూ సాగర్ కు పరుగులు తీసుకోంది. అంతకు ముందు శ్రీశైలం జలాశయం దగ్గర ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం పరిశీలించారు. ఆ తర్వాత జలవనరుల శాఖ అధికారులుతో మాట్లాడారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి శ్రీశైలం గేట్లు ఓపెన్ చేశారు.
శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదల
ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. జలాశయానికి సుంకేశుల, జరాల నుంచి 1,72,705 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.60 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 196.56 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. నాలుగు గేట్లతో పాటు, ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో వారం 10 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
Read Also: ప్రమాదంలో శ్రీశైలం గేట్లు, మార్చకపోతే తుంగభద్ర పరిస్థితేనా?