
తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా హల్ చల్ చేస్తున్న లేడీ అఘోరీ, నాగసాధువు వ్యవహారం సంచలనంగా మారింది. లేడీ అఘోరీతో ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన బీటెక్ స్టూడెంట్ వెళ్లడం కలకలం రేపుతోంది. తమ కూతురిని ట్రాప్ చేసి లేడీ అఘోరీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని యువతి పేరెంట్స్ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో లేడీ అఘోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. లేడీ అఘోరీ కిడ్నాప్ చేశారని చెబుతున్న బీటెక్ స్టూడెంట్ శ్రీ వర్షిణి హైదరాబాద్ లో ప్రత్యక్షం అయింది. లేడీ అఘోరీతో కారులో వెళుతున్న యువతి సంచలన విషయాలు చెప్పింది.
తనను ఎవరు కిడ్నాప్ చేయలేదుని శ్రీ వర్షిణి స్పష్టం చేసింది. తానే సొంతంగా పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చి ఇంట్లో నుండి వచ్చానని తెలిపింది. అఘోర మాత దగ్గరికి తానే సొంతంగా వచ్చానని.. ఆమె దగ్గర శిక్షణ తీసుకుంటున్నానని వెల్లడించింది. అఘోరీగా మారాలని నాకు ఎప్పటినుంచో కోరిక ఉందని.. తమ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలుసుని వర్షిణి తెలిపింది. అఘోరీ తనను బలవంతం పెట్టలేదని చెప్పింది. తనతో అఘోరీ కామ వాంఛ తీర్చుకున్నారని వస్తున్న వార్తలను వర్షిణి ఖండించింది. అఘోరీతో తనకు ఉన్నది తల్లి, బిడ్డ సంబంధం అని స్పష్టం చేసింది. లేడీ అఘోరీ తనతో సెక్స్ ఎలా చేస్తుందని.. తనపై అసత్య ప్రచారం చేసే వాళ్లకు ఈ విషయం తెలియదా అని శ్రీ వర్షిణి ప్రశ్నించింది.
Also Read : బిర్యానీ సెంటర్ లో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా బయటపడ్డ వస్తువులు!
గుంటూరు జిల్లా మంగళగిరిలో బిటెక్ చదువుతున్న విద్యార్థిని అఘోరీగా మారటానికి ఇంటిలో నుంచి వెళ్ళిపోవడం కలకలం రేపుతోంది.ప్రియదర్శిని కాలేజ్ లో బిటెక్ చదివిన విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్దీ రోజుల పాటు విద్యార్థిని ఇంట్లోనే అఘోరీ బస చేసింది. ఆ క్రమంలో అఘోరికీ, యువతికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
రెండు రోజుల క్రితం మేజర్ అయిన యువతి తాను అఘోరీగా మారటానికి హైదరాబాద్ వెలుతున్నట్లు పోలీసులకు చెప్పి వెళ్ళింది. తాను మేజర్‌ను అని, అయితే తన తల్లిదండ్రులకు తాను అఘోరీగా మారటం ఇష్టం లేదని దీంతో ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నట్లు చెప్పింది.తండ్రి కోటయ్య పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకుముందే ఆ యువతి పోలీసులకు తాను వెళ్ళిపోతున్నట్లు చెప్పడంతో అదే విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులుకు చెప్పారు. దీంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ కూతూరిని ఆఘోరి వశపరుచుకుందని ఆరోపించారు. అఘోరి చెర నుంచి తమ కూతురును విడిపించి తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు.