
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో స్వయంభువై వెలసిన శ్రీ సూర్య గిరి ఎల్లమ్మ (సూరన్ గుట్ట)ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రావణమాసం, మంగళ వారం అందులో నాగుల పంచమి కావడంతో దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వందలాదిగా తరలి వచ్చారు.ఉదయం నాలుగు గంటల నుండి దర్శనానికి లైన్లో వేచి ఉన్న భక్తులు నాగుల పంచమి కావడంతో మహిళలు బారి ఎత్తున ఆలయానికి చేరుకొని జంటనాగుల పుట్టకు పాలు,గుడ్డు పోయడానికి భక్తులు పోటీపడ్డారు.దైవదర్శనానికి వచ్చేవారు దాదాపు రెండు కిలోమీటర్ల వరకు కార్లు, ద్విచక్ర వాహనాలతో రోడ్డు భారీ ట్రాఫిక్ తో జామ్ కావడంతో ఆలయ ఈఓ మోహన్ రావు పోలీసులకు సమాచారనివ్వడంతో అక్కడికిచేరుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహన దారులను క్రమ సంఖ్యలో పంపించి ట్రాఫిక్ ని నియంత్రించారు.అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు ఆలయ చైర్మెన్ రెడ్డి గళ్ళరత్నం,ఈఓ మోహన్ రావు,ఆలయ కమిటీసబ్యులు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ‘చిన్నారి మృతి’
నాగార్జునసాగర్ 14 గేట్లు ఎత్తిన అధికారులు!