
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్)-: మండలంలోని శివన్నగూడెం గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఆలయ నిర్మాణం, నిధుల సేకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించుకున్నారు. శివన్నగూడెం గ్రామంలో అపురూపంగా నిర్మాణం అవుతున్న ఈ ఆలయానికి వందల ఏండ్ల చరిత్ర కలిగినది. చుట్టు పక్క గ్రామాలకు సైతం ఈ ఆలయం ప్రసిద్ధిగాంచిన పురాతన ఆలయంగా కోరిన కోరికలు, జీవితంలో అభయం ఇచ్చే కోట్ల గూడెం ఆంజనేయ స్వామి ఆలయం చాలా ఏండ్ల నుండి నిర్మాణానికి నోచుకోలేదు. కొంతమంది శివన్నగూడ గ్రామానికి చెందిన పెద్దల నిర్ణయం మేరకు మరియు దేవాదాయ శాఖ వారి సహకారంతో నేడు ఆలయం రూపుదిద్దుకుంది.
శివన్నగూడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ కి అతి చేరువలో ఉన్న ఈ ఆలయం, భవిష్యత్తులో టూరిస్టులకు అభయంగా నిలువనుంది. ఇప్పటివరకు ఆలయ నిర్మాణానికి 50 లక్షల వరకు నిర్మాణం జరిగింది. పూర్తి నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం సేకరించే కార్యాచరణని ఆలయ ప్రాంగణంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో
ఆలయ కమిటీ కన్వీనర్ మిడిమాలపు శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మారేపెల్లి గిరిధారచార్యులు, కో కన్వీనర్స్ దాసరి గోపాల్, మాకం చెన్న కేశవులు, మంచికంటి రాజు కమిటీ సభ్యులు మిడిమాలపు యాదగిరి రెడ్డి, మాకం గంగాధర్ నేత, మరియు గ్రామ పెద్దలు వంగాల రవీందర్ రెడ్డి, సంకబుడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.