- అక్కడ ఉన్నది మామూలు విహ్రహం
క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: కళ్యాణ ఉత్సవాలకు ఏడు శతాబ్దాల చరిత్ర ఉంది కళ్యాణ ఉత్సవాలకు ముస్తాబయింది శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం అత్యంత వైభవంగా అలంకరించుకుంది. నాటి పల్లవి చాళుక్య రాజుల నుంచి ఆరంభమైన కళ్యాణ ఉత్సవాలు అదే స్ఫూర్తితో కన్నుల పండుగగా నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో ప్రతి ఏటా చేపడుతారు.
ఎంతో చారిత్రాత్మక కట్టడం కాకతీయుల కాలంలోనే రూపుదిద్దుకున్న ఆలయం క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలోనే గణపతి దేవ చక్రవర్తి చేత నిర్మించిన కట్టడం దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశంలో ఆమనగల్లును ఎలుబడి చేశారు. పల్లవులు చాళుక్యులు శాఖలుగా చీలి రాష్ట్ర కుటుంబం అయ్యాయి సామాన్త్ర భాగమైన కాకతీయులు ఆమనగల్లు నుంచి ఆవిర్భవించినట్లు పురావాస్తు శాఖ శాసనాలు వెల్లడిస్తున్నాయి.
దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశంలో ఆమనగల్లును ఎలుబడి చేశారు. పల్లవులు, చాళుక్యులు శాఖలుగా చీలి రాష్ట్ర కుటుంబం అయ్యాయి. సామాన్త్ర భాగమైన కాకతీయులు ఆమనగల్లు నుంచి ఆవిర్భవించినట్లు పురావాస్తు శాఖ శాసనాలు వెల్లడిస్తున్నాయి.
దక్కన్ గులాల్ నాయక్ ప్రొఫెసర్ మనమంద రామారావు కాకతీయ సంచిక పురావస్తు శాఖ రెడ్డి సంచిక పద్మనాయక్ చరిత్ర తదితర పుస్తకాల్లో ఆమనగల్లు చరిత్ర పొందుపరిచి ఉంది. ఎన్నో బిరుదులు ప్రతిష్టించి ఆమనగల్లు మండలం పరిపాలన బాధ్యతలు అప్పగించినట్లు చరిత్ర వెల్లడిస్తుంది.
కాకతీయ రాజుల్లో గణపతి దేవ చరిత్ర ప్రసిద్ధుడు, ఈయన కాలంలో ప్రస్తుతం తెలుగు భాష మాట్లాడి భూభాగం కంచి నుంచి ఆరంభమై శ్రీకాకుళం వరకు రాజ్యపాలన సాగింది. గణపతి దేవుని తండ్రి మహా దేవరాజు సైన్యాధ్యక్షుడు కాకతీయుల దేవగిరి యాదవులకు జరిగిన యుద్ధంలో మరణించారు.
తరతరాల కాలం నాటి చరిత్ర ఆమనగల్లు సొంతం చేసుకుంది. 910 శతాబ్ద కాలంలో రేచర్ల బ్రహ్మారెడ్డి సర్వ సైన్యాధిపతిగా ఆహ్వానింపబడి వరుసగా కాకతీయ గణపతి చక్రవర్తి కాలం వరకు వీరి ఎలుబడి సాగింది. అంతటి ఘన చరిత్రను సొంతం చేసుకున్న ఆమనగల్లు దేవాలయంలో భక్తులు ఎంతో ప్రీతి ప్రాంతంగా పూజలు చేయడం అనవాయితీ.
కాకతీయుల కాలంలో ఆమనగల్లు మండలం గా పిల్లలమర్రి అంతర్భాగంగా ఉండేదట అలనాడు దోపిడీ దొంగలు దాడులు అధికం కావడంతో గ్రామానికి చెందిన రైతు రేచర్ల చెవిరెడ్డి నాయకత్వంలో గ్రామ రక్షణ దళంగా ఏర్పడి గ్రామాన్ని దొంగల బారి నుండి రక్షించుకున్నట్లుగా తెలుస్తుంది.
అప్పుడు గణపతి దేవునికి నాడు తండ్రితో కలిసి వచ్చి దేవగిరి యాదవులకు బందీగా చిక్కిపోయాడు. దీంతో కాకతీయ రాజ్యం పతనమైంది. ప్రస్తుత వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన రేచర్ల బేతిరెడ్డి రుద్రారెడ్డి అన్నదమ్ములు అత్యంత ధైర్యసహసాలతో దేవగిరి యాదవులు చరిత్ర నందిగా ఉన్న గణపతి దేవుడిని విడిపించుకునేందుకు ఏడాదిన్నర కాలం పట్టింది.
తిరిగి కాకతీయుల సింహాసనాన్ని గణపతి దేవుడు అధిష్టించారు. అన్నదమ్ముల ఇద్దరిదీ నిస్వార్థ సేవ ధైర్యసహసాలకు బుద్ధుడై ఆమనగల్లుకు బేతిరెడ్డిని సామంత రాజుగా నియమించారు. పిల్లలమర్రి నుంచి నాగులపాటి అన్నారం.
వాడపల్లి పరిధి వరకు రుద్రా రెడ్డికి వరంగల్ జిల్లా ఎలకుర్తి హవేలీ పొలంపేట రాయప్ప టెంపుల్ విభాగానికి సామంతు రాజులుగా నియమించారు. బేతి రెడ్డికి ఇద్దరు కుమారులు నామిరెడ్డి చెవిరెడ్డి, ఓ రోజు బేతిరెడ్డి రుద్రారెడ్డి వరంగల్ వెళ్లి వస్తూ పిల్లల మర్రి వద్ద పెద్ద మర్రి వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటుండగా చెట్టుపై గల పక్షులు గుడ్లగూబలు కొద్ది సమయంలో ప్రమాదం పొంచి ఉందని మర్రి వృక్షం నేలవాల్తుందన్న సంకేతాలు అందించాయట.
వృక్షం అడుగు భాగంలో నిధి నిక్షేపాలు ఉన్నాయని సంభాషించుకున్న తీరును గమనించి బేతి రెడ్డి రుద్రారెడ్డిలు పక్కకు రాగా అదే నిజమైందట ఆ ధనంతోనే పిల్లలమర్రిలో త్రికుంటేశ్వర ఆలయం నాగులపాటి అన్నారంలో నాగేశ్వర ఆలయం వాడపల్లిలో మీనాక్షి అజ్ఞాతేశ్వరాలయం రామునికి ప్రీతిపాత్రమైన రామేశ్వరం రామలింగేశ్వర ఆలయాలు నిర్మించారు.
బేతి రెడ్డి తదుపరి నామిరెడ్డి చెవిరెడ్డిలు పరిపాలించారు. నామిరెడ్డి పాలన గణపతి దేవునికి సంతానం కలిగి రుద్రమదేవి జన్మించింది. ఆ సమయంలో స్త్రీ కి రాజ్యపాలన చేసే ఆది కారం లేదు అయినప్పటికీ రుద్రమదేవినీ మగసంతానంగా నమ్మించి పాలన సాగించినట్లు చరిత్ర ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి..
ఎకరం నర స్థలంలో గుడి నిర్మాణం… గణపతి దేవ చరిత్ర ఆమనగల్లు విశిష్టతను దృష్టిలో ఉంచుకొని గుట్టపై ఎకరం ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం శివలింగం ప్రతిష్టించినందుకుగాను తిప్పర్తి మండలం మామిడాల నుంచి తీసుకొస్తున్నండగా ఆలయ సమీపంలోకి రాగానే చెరువులో పడిపోయింది. ఇక వెలికితీయడం కష్టతరంగా భావించిన వేద పండితులు నిర్ణయించిన ముహూర్తానికి గోధుమ పిండితో శివలింగాన్ని సిద్ధం చేసి ప్రతిష్టించారు
