అంతర్జాతీయం

శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘే అరెస్ట్, కారణం ఏంటంటే?

Ranil Wickremesinghe arrested: శ్రీలంక మాజీ అధ్య‌క్షుడు రాణిల్ విక్ర‌మ‌సింఘే అరెస్ట్ అయ్యారు. సీఐడీ అధికారులు ఆయయను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని శ్రీలంకన్ మీడియా వెల్లడించింది.  ఓ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు సీఐడీ ఆఫీసుకు వెళ్లిన అతడిని అరెస్టు చేసినట్లు వార్తలు ప్రసారం చేశాయి. ప్ర‌భుత్వ నిధుల దుర్వినియోగం కేసులో విక్ర‌మ్‌ సింఘే ను సీఐడీ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఏ కేసులో అరెస్ట్ అయ్యారంటే?

సెప్టెంబ‌ర్ 2023లో రాణిల్ విక్ర‌మ‌సింఘే లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఆ పర్యటన సందర్భంగా ప్రభుత్వ నిధులు మిస్ యూజ్ చేశారనే ఆరోపణులు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి గత కొద్ది రోజులు సీఐడీ విచారణ జరుపుతోంది. ఆ అంశానికి సంబంధించిన కేసులో విక్ర‌మ‌సింఘేను అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. బ్రిటీష్ యూనివ‌ర్సిటీలో విక్ర‌మ‌సింఘే భార్య‌ను స‌త్క‌రించే కార్య‌క్ర‌మం కోసం ఆయ‌న వెళ్లారు. విక్ర‌మ‌సింఘేను కొలంబో ఫోర్ట్ మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రుస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల కోసం ప్ర‌భుత్వ నిధుల‌ను వాడుకున్న‌ట్లు ఆరోప‌ణ‌ల నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

Back to top button