
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు తరఫున బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన ఘనపరిచిన మన తెలుగు బిడ్డ శ్రీ చరణి మంచి మనసు చాటుకున్నారు. ఇప్పటికే శ్రీ చరణి పై రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే వరల్డ్ విజయంలో కీలకపాత్ర పోషించిన మన తెలుగమ్మాయి తీసుకున్నటువంటి నిర్ణయం పై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే చిన్నప్పటి నుంచి కడప క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ పొందినటువంటి శ్రీ చరణి కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కడప తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కమలాపురం ఎమ్మెల్యే ఏకంగా 10 లక్షల రూపాయలను బహుమానంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే వెంటనే ఈ డబ్బు మొత్తాన్ని కూడా అకాడమీ లో ట్రైనింగ్ పొందుతున్నటువంటి అండర్ 14 క్రికెట్ టీం ప్రోత్సాహానికి కేటాయించాలి అని… మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది మహిళా క్రికెటర్లు దేశం తరఫున ఆడాలి అని కోరుకున్నారు. అయితే శ్రీ చరణి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మన తెలుగు అమ్మాయి ప్రపంచ క్రికెట్లో సత్తా చాటడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
Read also : చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవి.. ఎందుకంటే?
Read also : ఎర్రచందనం స్మగ్లింగ్ పై.. డిప్యూటీ సీఎం మాస్ వార్నింగ్!





