తెలంగాణ

మహిళల హాస్టల్ లో స్పై కెమెరా కలకలం!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ బాలికల హాస్టల్ లో స్పై కెమెరా కలకలం రేపింది. హాస్టల్ ను నడుపుతున్నటువంటి వ్యక్తి ఈ స్పై కెమెరాని పెట్టినట్లుగా విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే… తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులు స్పై కెమెరా ని గుర్తించడం జరిగింది. హాస్టల్ ను నడుపుతున్న మహేశ్వర అనే వ్యక్తి తన ఫోన్ చార్జర్ లో కెమెరా పెట్టినట్లు విద్యార్థులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడు దగ్గర నుంచి చార్జర్ ను తీసుకొని దానిని భాగాలుగా విభజించి స్పై కెమెరాను గుర్తించి, స్పై కెమెరాలోని పలు చిప్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

కాగా ఇటువంటి ఘటనలు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలానే చూశాం. మహిళలంటే కొన్ని కాలేజీలలో మరియు హాస్టల్స్ లలో చులకనగా చూడడం అలవాటయింది. ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్స్ కు, మరియు కాలేజీలకు పంపుతుంటే కాలేజ్ యాజమాన్యాలు మాత్రం విద్యార్థులకు అసలు కనీస భద్రత ఇవ్వట్లేదని తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కాలేజీ యాజ్మాన్యాలు సింపుల్గా మాకు ఏమీ తెలియదు అంటూ తప్పుకుంటున్నారని కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిందితులను కఠినంగా శిక్షిస్తే ఇలాంటి ఘటనలు ఇంకోసారి రిపీట్ కావు అని పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులు సూచిస్తున్నారు.

అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులు నడిపితే కఠిన చర్యలు తప్పవు

లార్వా నిర్మూలనకు డ్రోన్ సహయంతో పిచికారీ : స్వర్ణ రాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button