తెలంగాణ

ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి…ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించండి : ఎస్పీ శరత్ చంద్ర

-వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ముందు 48 గంటలు సైలెంట్ పిరియడ్.

-ఉపాధ్యాయ య.యల్.సి ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు.

-జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ IPS

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ ఎన్నికలు ఈ నెల 27 న జరగనున్న నేపథ్యంలో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకొనుటకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని, పోలింగ్ ముందు 48 గంటలు తేది 25-02-2025 సాయంత్రం 4 గంటల నుండి తేది 27-05-2025 పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ ఉంటుందని జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు.సైలెన్స్ పీరియడ్ లో యం.ఎల్.సి ఎన్నికలకు సంబందించిన సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు.

ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం – 12 మంది ఆప్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

జిల్లాలో ఎన్నికల నిర్వహణకు టి.యస్.యస్.పి సిబ్బందితో పాటు దాదాపు 600 మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని వీరందరూ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు విధులు నిర్వహించనున్నారు అన్నారు.జిల్లాలో ఎన్నికలు ముగిసే వరకు 163 BNSS (144) సెక్షన్ అమలు లో ఉంటుందని, ఎవ్వరూ 5 గురి కంటే ఎక్కువ గుంపులుగా ఉండ కూడదని అన్నారు. పోలింగ్ కు 48 గంటల ముందు నుండే ప్రతీ ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమావేశాలు, ఇంటింటా ప్రచారం లాంటివి చేయవద్దని అన్నారు.వేరే నియోజక వర్గం నుండి ప్రచారానికి వచ్చిన వాళ్లు స్థానికంగా ఏవ్వరూ ఉండకూడద్దని, లాడ్జ్ లు, గెస్ట్ హౌస్ లు, హోటళ్లలో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు మరియు రాజకీయ పార్టీ ల వారు తేది 25-02-2025 సాయంత్రం 4 గంటల లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అన్నారు.

300 మంది చిన్నారులపై అత్యాచారం – జంతువులనూ వదలని మాజీ సర్జన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button