
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- చాలా రోజుల తర్వాత ఇండియా కూటమిలో మళ్ళీ ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల అహంకారం వల్లే ఇండియా కూటమికి ఓటమిలు ఎదురవుతున్నాయని సమాజ్వాది పార్టీ తాజాగా స్పష్టం చేసింది. ఢిల్లీలో నిన్న ఎలక్షన్స్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ ఎలక్షన్లపై ఎగ్జిట్ పోల్స్ ఆప్ పార్టీ ఓటమిని అంచనా వేశాయి. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై విమర్శలు ఎక్కు పెట్టింది. ఢిల్లీలోని కాంగ్రెస్ అక్కడ బిజెపి రెండవ టీం లా పని చేసిందని సమాజ్వాద్ పార్టీ ఎంపీ రాంగోపాల్ కాంగ్రెస్ నాయకులపై తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ, ఖర్గే, వాద్రా బిజెపి భాషల్లో మాట్లాడారని, ఈ సందర్భంలోనే ఆప్ పార్టీ పతనానికి ప్రయత్నించారని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల అహంకారం వల్లే ఆరోజు హర్యానా మరియు మహారాష్ట్రలో ఓడిపోయారని తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఇండియా కూటమిలో మళ్ళీ ముసలం ఏర్పడింది. కాగా నిన్న జరిగిన ఎలక్షన్లలో బిజెపి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరోవైపు ఆల్ ఇండియా ఇమామ్ అధ్యక్షుడు రషీద్ కూడా బిజెపికే ఓటు వేశానని చెప్పడంతో సంచలనంగా మారింది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ల సమయంలో అహంకారాన్ని చూపించారని చాలామంది సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై మండిపడుతున్నారు. పక్కా ప్రణాళికలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఎలా గెలుస్తుందని చాలామంది అంటున్నారు.
ఇవి కూడా చదవండి
1.నల్గొండ జిల్లాలో తాగునీటి కష్టాలు.. కేసీఆరే రావాలంటున్న జనాలు
2.ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ…
3.కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు!… చాలా క్లాసిక్ గా ఉందంటూ అభిమానులు కామెంట్లు?