
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో మరో విషాదం చోటు చేసుకుంది. 8వ తరగతికి చెందిన విద్యార్థి మనస్థాపానికి గురై పాఠశాల భవనం పై నుండి దూకి మరణించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాదు, ఉప్పల్ లోని ఓ స్కూల్లో ఘటన జరిగింది. ఇంక అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఉప్పల్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న సంగారెడ్డి అనే 13 ఏళ్ల విద్యార్థి ప్రతిరోజు బాగా పాఠశాలకు వెళ్లి చదువుకునేవాడు. అయితే PET మందలించి కొట్టడంతో బాగోద్వేగంలో ఒంటరిగా ఉన్న సంగారెడ్డిని మరో టీచర్ కూడా తిట్టడంతో తీవ్రంగా మనస్థాపానికి గురయ్యాడు. ఇక వెంటనే ఒక నోట్ బుక్ తీసుకొని క్షమించు అమ్మ… నేను ఈరోజు చనిపోతున్నాను అంటూ ఒక లెటర్ రాసి దాన్ని అక్కడే వదిలేసి పాఠశాల భవనం పైకి ఎక్కాడు. ఇక ఆ పాఠశాల భవనం పై నుంచి కిందకు దూకడంతో సంగారెడ్డి అనే విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక వెంటనే అక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బంది విద్యార్థిని ఆసుపత్రికి తీసుకు వెళ్లే సమయంలోనే మార్గమధ్యలో మరణించాడు.
ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుపై మండిపడ్డ హైకోర్టు..
ప్రస్తుతం ఈ విషయం తెలంగాణ రాష్ట్రంలో వైరల్ గా మారింది. కావాలనే చాలామంది టీచర్లు పిల్లలపై ఒత్తిడి పెడుతూ.. మందలిస్తున్నారని అన్ని అంటున్నారు. టీచర్ల ఒత్తిడి కారణంగానే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక చిన్న చిన్న విషయాలకే పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. కారణం ఏమైనా కూడా ఆత్మహత్య దానికి జవాబు అన్నట్లుగా విద్యార్థులు కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకునే ముందు ఒకసారి తల్లిదండ్రుల గురించి ఆలోచించి ముందడుగు వేయాలని చాలామంది కోరుతున్నారు. ఇప్పటికే పోలీసు అధికారులు కూడా వీటిపై ఆరా తీస్తున్నారు. చాలా పాఠశాలలకు మరియు కాలేజీలకు వెళ్లి ఆత్మహత్యలపై అవగాహన కూడా కల్పిస్తున్నారు. కానీ చిన్న చిన్న విషయాలకే మనస్థాపాలకు గురై విద్యార్థులు అలాగే యువకులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
యూట్యూబ్ ఛానల్ ముసుగులో ‘స్పా’ సెంటర్ నిర్వహణ..?
చంద్రబాబు పై నోరు అదుపులో పెట్టుకో కేసిఆర్, జగదీష్ ఖబర్దార్ : పిఎసిఎస్ చైర్మన్ రాములు యాదవ్