
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మన భారతదేశం నుంచి కూడా ప్రతి ఏడాది కొన్ని వేల మంది యువకులు దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్తున్నారు. చదువుకోవడానికి అక్కడికి వెళ్లినటువంటి మన భారతదేశ యువకులు ప్రతి ఒక్కరు కూడా జాబ్ తెచ్చుకొని అక్కడే స్థిరపడిపోతున్నారు. ఈ మధ్యకాలంలో బీటెక్ లేదా డిగ్రీ అయిపోయింది అంటేనే.. మధ్యతరగతి కుటుంబాలు కూడా అప్పు చేసి మరి తమ పిల్లలు బాగా చదువుకోవాలి అలాగే స్థిరపడాలి అని చెప్పేసి విదేశాలకు పంపిస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో యువత ఎక్కువగా విదేశాలకు వెళ్లడం కారణంగా తల్లిదండ్రులు ఒంటరి భావానికి గురవుతున్నారు. మరోవైపు తల్లిదండ్రులను చూడాలని అనుకున్న కూడా ఉద్యోగాలు అలాగే వీసా సమస్యల కారణంగా తమ పిల్లలు తిరిగి రావడానికి కుదరట్లేదు. ఈ తరుణంలోనే పిల్లలను చూడలేక.. తల్లిదండ్రులు తీవ్రమైన ఒంటరితనానికి లోనవుతూ కుమిలిపోతూ ఉన్న సందర్భాలు ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా విదేశాల్లో ఉన్నటువంటి యువత చివరి చూపు చూసుకోవడానికి కూడా వచ్చే పరిస్థితులు లేవు. అప్పటికప్పుడు విదేశాల నుంచి స్వదేశాలకు రావడం అనేది అంత సులభం అయితే కాదు. కాబట్టి విదేశాలకు వెళ్లేటువంటి యువత ఈ విషయాలను గమనించాలి అని కొంతమంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తల్లిదండ్రుల చివరి క్షణాలలోనైనా పిల్లలు వారి వద్దనే ఉంటే కాస్త సంతృప్తి అయిన పడుతారు అని అంటున్నారు.
Read also : ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్… తెలుగు రాష్ట్రాల్లో విస్తృత స్థాయి తనిఖీలు.. భయాందోళనకు గురవుతున్న ప్రజలు!





