Monday, March 23, 2026
Homeక్రైమ్పని ఒత్తిడితో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

పని ఒత్తిడితో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

 

హైదరాబాద్‌ మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సతీష్‌ (31) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పని ఒత్తిడి భరించలేకే సూసైడ్‌ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏపీలోని అమలాపురానికి చెందిన సతీష్‌కు ఏడాది క్రితం వివాహమైంది. మియాపూర్‌లోని బీకే ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు. సంక్రాంతి పండగ కోసం భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో పని ఒత్తిడికి గురైన సతీష్‌… ఇంట్లో ప్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments