తెలంగాణ

కేటీఆర్ కేసులో కీలక పరిణామాలు!.. కేటీఆర్ వైపే అందరి వేళ్ళు?

ఫార్ములా ఈ రేసులో అందరూ కేటీఆర్‌ వైపే వేళ్లు చూపిస్తున్నారు. అధికారులుగా తమ బాధ్యతలు తాము నిర్వర్తించామని పై అధికారులు చెప్పింది చేశామని ఏసీబీ, ఈడీ అధికారులకు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్‌ రెడ్డి వాంగ్మూలాలు ఇచ్చారు. ఏసీబీ అధికారుల ఎదుట బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. సుదీర్ఘంగా ఆయనను ప్రశ్నించారు. ఈ క్రమంలో చీఫ్ ఇంజినీర్‌గా తన పాత్ర చాలా పరిమితమని.. పై అధికారులు ఏం చెబితే అది చేశానని వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన నుంచి ఏసీబీ అధికారులు పలు వివరాలు రాబట్టారు.

Read More : తిరుపతి తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం!..

ఇక ఈడీ కేసులో ఐఏఎస్ అర్వింద్ కుమార్ కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పినట్లుగా చేశానని ఆయన స్పష్టం చేశారు. కెబినెట్ నిర్ణయాలు, ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడం, విదేశీ మారకద్రవ్యం తరలించడం వంటి వ్యవహారాలపై సమాధానాలు రాబట్టారు. అయితే అంతా కేటీఆర్ అన్నకోణంలోనే ఇద్దరి అధికారులు రెండు దర్యాప్తు సంస్థలకు వాంగ్మూలాలు ఇచ్చారు. అంటే కేటీఆర్ దే అంతా బాధ్యత అని స్పష్టం చేసినట్లయింది.

Read More : తిరుపతికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి!..

అయితే కేటీఆర్ మాత్రం బయట ఏం మాట్లాడినా కోర్టుల్లో మాత్రం టెక్నికల్ అంశాలను ప్రస్తావిస్తున్నారు. తాను ఆదేశాలు ఇస్తానని నియమ నిబంధనల ప్రకారం పనులు చేయాల్సింది అధికారులేనని అంటున్నారు. డబ్బులు తరలించడానికి తీసుకోవాల్సిన చర్యలను తన దృష్టికి తీసుకు రాకపోవడం.. ప్రొసీజర్ పాటించకపోవడం అధికారుల తప్పేనని అంటున్నారు. ఏసీబీ ఎదుటకు కేటీఆర్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Read More : ఆడది చదివితే వర్షాలు రావు.. బ్రహ్మానందం కామెంట్లపై రచ్చ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button