
Snake bite: వర్షాలు ప్రారంభం అయ్యే సమయంలో గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో పాముల సంచారం సహజంగానే పెరుగుతుంది. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో వీటి కదలికలు ఎక్కువగా కనిపిస్తాయి. వేసవి కాలంలో నిద్రావస్థలో ఉండే పాములు తొలకరి వర్షాలు పడే సమయానికి సంతానోత్పత్తి చురుకుగా చేపడుతాయి. ఈ కారణంగా ఆరు, ఏడవ నెలల్లో పెద్ద పాములతో పాటు వాటి పిల్లలు కూడా అధికంగా బయటకు వస్తాయి. వ్యవసాయ పొలాలు, నీటితడులు, గడ్డి ఉన్న ప్రదేశాల్లో పాములు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సీజన్‌లో రైతులు పాము కాటుకు గురయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మన దేశంలో పాముకాట్ల కారణంగా అనేక ప్రాణాలు కోల్పోతున్నాయి.
పాముల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల భయం మరింత పెరిగి, విషపూరితం కాని పాముల కాటు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. విషపూరితమైనవి, తక్కువ విషపూరితమైనవి అనే విభజన తెలియకపోతే బాధితులు ఆందోళనకు గురై మరింత తీవ్రమైన పరిస్థితులకు చేరుతారు. గ్రామాలు, అడవి ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
పాము కాటు పడిన వెంటనే శరీరంలో వివిధ రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ విషపూరితమైన పాముల కాటు అయితే నిమిషాల్లోనే విషం శరీరంలో వ్యాపిస్తుంది. తక్కువ విషపూరితమైన పాముల విషం అయితే గంటల వ్యవధిలో పాకుతుంది. ఏ పరిస్థితుల్లోనైనా బాధితుడిని త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యసహాయం అందించడం అత్యంత కీలకం.
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాముల్లో కింగ్ కోబ్రా అగ్రస్థానం దక్కించుకుంది. ఒక్క కాటుతోనే భారీ మోతాదులో విషాన్ని విడుదల చేసే ఈ పాము కాటు వేయడం వల్ల బాధితుడు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే విధంగా నాగుపాము కాటు కూడా తీవ్రమైన ఫలితాలు ఇస్తుంది. బాధితుడి శరీర ప్రతిఘటనపై ఆధారపడి 2 నుంచి 5 గంటల్లో ప్రమాదం ఏర్పడవచ్చు.
కింగ్ కోబ్రా కాటు తర్వాత విషం నాడీ వ్యవస్థను క్రమంగా దెబ్బతీస్తుంది. కంటిచూపు తగ్గడం, పక్షవాతం రావడం, చివరికి వ్యక్తి మూర్ఛపడటం వంటి లక్షణాలు వేగంగా కనిపిస్తాయి. హృదయ స్పందన ఆగిపోవడం వల్ల మరణానికి దారితీస్తుంది. ఈ జాబితాలో రెండో అత్యంత ప్రమాదకర పాము ఇన్‌ల్యాండ్ తైపాన్, ఇది కాటు వేస్తే 20 నిమిషాల్లోనే ప్రాణహాని సంభవించవచ్చు.
ALSO READ: Jubilee hills Election: బీఆర్ఎస్ ఓటమిపై కవిత సంచలన ట్వీట్





