ఇన్నాళ్లుగా సాఫీగా సాగిన సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ నేడు చివరి సమరానికి చేరుకుంది. ఇక ఫైనల్ కు ముంబై జట్టు మరియు మధ్యప్రదేశ్ జట్టు చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు జియో సినిమా యాప్ లో మనం ఈ మ్యాచ్ను వీక్షించవచ్చు. ఇప్పటికే ఈ రెండు జట్లు కూడా మంచిగా ఆడి ఇవాళ ఫైనల్ కు చేరుకున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా ముంబై జట్టు నిలవనుంది.
అల్లు అర్జున్ ను బయటకు తీసుకు వచ్చిన లాయర్ కు ఇన్ని లక్షలా?
ఇక చిన్న స్వామి స్టేడియం వేదిక జరగనున్న ఇవాళ చివరి పోరు లో మధ్యప్రదేశ్ మరియు ముంబై జట్టు ఆమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశ నుండే తిరుగులేని ఆధిపత్యం కనబరిచినటువంటి ముంబాయి చెట్టు టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉండగా మరోవైపు దాదాపుగా 13 ఏళ్ల తర్వాత ఫైనల్ కు చేరుకుంది ఈ మధ్యప్రదేశ్ జట్టు. ఈ మధ్యప్రదేశ్ జట్టు కూడా ఫైనల్లో గెలవాలని తపనతో ఉంది.
మూడో టెస్ట్ ఆరంభంలోనే భారీ వర్షం!.. పరిస్థితి ఏంటి?
అయితే ఈ రెండు జట్లలో ముంబై తరపున స్టార్ ఆటగాళ్లతో ఫైనల్ గెలిచే అవకాశం ఉండగా మరోవైపు సాధారణ ప్లేయర్లతో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఫైనల్ వరకు చేరుకుంది మధ్యప్రదేశ్ జట్టు. ఇక మధ్యప్రదేశ్ కెప్టెన్ అయిన రజత్ పటిదార్ మంచి ప్రదర్శనతో ట్రోఫీ దక్కించుకోవడమే మా లక్ష్యమని అన్నారు. ఒకవైపు ఇద్దరు ముగ్గురు స్టార్ ప్లేయర్లతో మధ్యప్రదేశ్ టీం మరోవైపు అందరూ స్టార్ ఆటగాళ్లతో ముంబై జట్టు లలో ఎవరు కప్పు ను స్వాధీనం చేసుకుంటారో అనేది తెలియాలంటే ఈరోజు రాత్రి వరకు వేచి ఉండాల్సిందె.
అల్లు అర్జున్ పాక్ బార్డర్‌లో యుద్దం చేశాడా.. నేనే పెద్ద స్టార్.. సీఎం రేవంత్ సీరియస్