
హరిద్వార్ (ఉత్తరాఖండ్), క్రైమ్ మిర్రర్: -ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లోని మాన్సా దేవి ఆలయంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రావణ మాసం సందర్భంగా విశేషమైన దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో పట్టించుకోని గందరగోళం తలెత్తి తొక్కిసలాటకు దారి తీసింది.పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు, ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, 25 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. గాయపడిన వారిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కొండాపూర్‌లో డ్రగ్స్‌తో రేవ్ పార్టీ భగ్నం.. 11 మంది అరెస్ట్
ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయిన అధికారులు, NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆలయంలోని రద్దీని నియంత్రించేందుకు పోలీసు బలగాలు మోహరించాయి. తీరా ఆలయం పరిసర ప్రాంతాల్లో క్షణికంగా ఉద్రిక్తత నెలకొంది. ఇలాంటి సంఘటనలు భక్తుల భద్రతపై సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉందని స్థానికులు మండిపడుతున్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సురక్షిత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆలయ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
శ్రావణమాసం ఆగమనం… తగ్గిన చికెన్ ధరలు!