క్రైమ్

ఆధారాలు లేని అభియోగాలు వద్దు, మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్!

Singer Mangli Reaction: తన బర్త్ డే వివాదంపై సింగర్ మంగ్లీ తొలిసారి స్పందించింది. బర్త్ డే వేడుకలో ఎలాంటి డ్రగ్స్ వాడలేదని వెల్లడించింది. పోలీసులకు కూడా ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదన్నది. ఈ వివాదంపై తొలిసారి స్పందించిన ఆమె, అనవసరంగా తన మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యింది. బర్త్ డే పార్టీ వివాదంపై వివరణ ఇస్తూ, ఓ వీడియోను విడుదల చేసింది. తన తల్లిదండ్రుల కోరిక మేరకే రిసార్టులో బర్త్ డే వేడుకలు జరుపుకున్నట్లు తెలిపింది.

మద్యానికి అనుమతి తీసుకోవాలని తెలియదు!

తన బర్త్ డే వేడుకల్లో కుటుంబ సభ్యులు, తన టీం మెంబర్స్, కొంత మంది ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నట్లు మంగ్లీ వివరించింది. “ఫంక్షన్ కాబట్టి మద్యం, డీజే పెట్టాం. టికి అనుమతి తీసుకోవాలని నాకు తెలియదు. సడెన్ గా ఫంక్షన్ ప్లాన్ చేసుకోవడం వల్ల అనుమతి తీసుకోవాలని ఎవరూ చెప్పలేదు. తెలిసి ఏ తప్పూ చేయలేదు. తెలియకుండా అలా జరిగింది. లోకల్ లిక్కర్ తప్ప ఇంకేమి వాడలేదు. మాదక ద్రవ్యాలు అసలే వాడలేదు. అక్కడ పోలీసులకు మాదక ద్రవ్యాలు దొరకలేదు. గంజాయి పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూడా వేరొక చోట తీసుకున్నట్లు చెప్పాడు. పోలీసు విచారణకు సహకరిస్తున్నాం. దయచేసి ఆధారాలు లేని అభియోగాలు మోపకూడదని మీడియా మిత్రులను కోరుతున్నా” అని మంగ్లీ వివరణ ఇచ్చింది.

మంగ్లీ సహా పలువురిపై కేసులు

మంగళవారం అర్ధరాత్రి చేవెళ్లలోని ఓ రిసార్ట్‌ పై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులూ లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించడం, మద్యం సరఫరా చేయడం, గంజాయి సేవించిన వ్యక్తి పట్టుబడడంతో మంగ్లీతో పాటు నలుగురి మీద  పోలీసులు కేసు పెట్టారు. అర్ధరాత్రి వేళ డీజే పెట్టి పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు  దాడి చేశారు. ఈ వేడుకలకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని గుర్తించారు. అక్కడ ఉన్న 22 మందిలో 9 మందికి డ్రగ్స్ పరీక్షలు చేశారు. వారిలో దామోదర్‌రెడ్డికి పాజిటివ్‌గా వచ్చింది. తాను వేరొకచోట గంజాయి తీసుకున్నట్లు తెలిపాడు. ఈ పార్టీకి సంబంధించి  నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో ఎలాంటి విదేశీ మద్యం దొరకలేదన్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్‌, శబ్దకాలుష్య చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.

Read Also: మంగ్లీ బర్త్ డే వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి పట్టివేత!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button