
చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరు పట్టణ కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో మంగళవారం రోజు కరాటే పోటీలలో ప్రతిభ కనబర్చి, పతకాలు సాధించిన విద్యార్దులకు స్థానికులు ఎస్.ఐ. నర్సింగ్ వెంకన్న అభినందనలు తెలియజేశారు. ఆదివారం నాడు నల్లగొండ పట్టణం లోని శివాంజనేయ గార్డేన్స్ లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ వారియర్స్ కప్- 2025 లో చండూరు గాంధీజీ పాఠశాల విద్యార్దులు ఏకాంగా పది బంగారు పథకాలు, ఏడు రజత పథకాలు, 7 కాంస్య పథకాలు, మరియు 4 ప్రశంస పథకాలు సాధించి విజయ దుందుభి మ్రోగించారు.
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి… ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించండి : ఎస్పీ శరత్ చంద్ర
బంగారు పథకాలను సాధించిన విద్యార్ధులు శ్రీనిధి, ఓం, ఐశ్వర్య, చక్రధర్, అభినయ్, లలిత్ కిషోర్,విజయ్ కాంత్ లు, వెండి పథకాలు సాధించిన విద్యార్థులు సహస్ర, దినేష్, చరణ్, అభినవ్, గోపిలతలు, కాంస్య పథకాలు సాధించిన విద్యార్ధులు దినేష్, గోపిలత, తేజస్విని, లలిత్ కిషోర్, త్రినాధ్, ఆశ్రిత, విజయ్ కాంత్ లు వున్నారు. విజేతలైన విద్యార్థులను చండూరు ఎస్సై నర్సింగ్ వెంకన్న బహుమతులను, మెడల్స్ ను, సర్టిఫికెట్లను అందించి, అభిననoదించారు. ఈ సందర్భoగా ఎస్సై మాట్లాడుతూ ఈ విద్యార్ధులు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించి చదువుకున్న పాఠశాలకు, పుట్టిన గ్రామానికి మరియు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ట్రస్మా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ కరాటే శారీరక దృఢత్వానికీ , మానసిక వికాసానికి దోహద పడుతుందని, ప్రతి విద్యార్ధి అంకిత భావంతో కరాటేను నేర్చుకొని రాణీంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, కరాటే కోచ్ శ్రీధర్ సాగర్, గణేష్, యాదగిరి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ సమరంలో బీజేపీదే విజయం :- జోగేంద్ర
300 మంది చిన్నారులపై అత్యాచారం – జంతువులనూ వదలని మాజీ సర్జన్