
Shubhanshu Shukla: యాక్సియం-4 మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లి, రెండు వారాల పాటు ప్రయోగాలు చేసిన శుభాన్షు శుక్లా సహా నలుగురు హ్యోమగాములు భూమికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇవాళ ఉదయం వారంతా భూమ్మీదకు బయల్దేరనున్నారు. ఈ సందర్భంగా స్పేస్ స్టేషన్ లో జరిగిన వీడ్కోలు సమావేశంలో శుభాన్షు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అతరిక్షం నుంచి భారత్ ఆశావాదం, నిర్భయత్వం, విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోందన్నారు. ఈ యాత్రకు గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా.. స్పేస్ నుంచి భారత్ ఎలా కనిపిస్తోందన్న ప్రశ్నకు సారే జహా సే అచ్ఛా అని ఆన్సర్ ఇచ్చారు. 1984లో తొలిసారిగా అంతరిక్ష యాత్ర చేసిన రాకేశ్ శర్మ అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తోందన్న ప్రశ్నకు సారే జహా సే అచ్ఛా అని జవాబిచ్చారు. అదే మాటను ప్రస్తుతం శుభాన్షు గుర్తు చేశారు.
ఉదయం 7.05 గంటలకు తిరుగు ప్రయాణం
ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 11 మంది వ్యోమగాములు ఉన్నారు. వారిలో ఏడుగురు ఎక్స్పిడిషన్-73 ద్వారా వెళ్లారు. శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు యాక్సియం-4 మిషన్ ద్వారా వెళ్లారు. ఈ నలుగురి తిరుగు ప్రయాణం గురించి నాసా కమర్షియల్ క్రూ ప్రొగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ కీలక విషయాలు చెప్పారు. సోమవారం ఉదయం 7.05 గంటలకు ఐఎస్ఎస్‌లోని హార్మోనీ మాడ్యూల్ ద్వారా ఆ నలుగురు బయటకు వచ్చి స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లోకి అడుగు పెడతారని చెప్పారు. ఈ అంతరిక్ష వాహక నౌక.. కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగుతుందన్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 3.00 గంటలకు భూమి మీదకు వస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేందర్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. శుభాన్షు తన యాత్రను ముగించుకుని భూమ్మీదకు వస్తున్న వేళ భారతీయులు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
Read Also: రైతుగా మారి.. అంతరిక్షంలో ఆకుకూరలు పెంచుతున్న శుభాన్షు!