
Shocking: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా పరిధిలో షాక్‌కు గురిచేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన సుమారు 24 ఏళ్ల యువకుడు అనూహ్యంగా తన మర్మాంగాన్ని కోసుకోవడం కలకలం రేపింది. తీవ్ర రక్తస్రావం జరుగుతున్నప్పటికీ అతడు అలాగే రోడ్డుపై తిరుగుతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియగానే అక్కడున్నవారు వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించారు.
సోమవారం ఉదయం విశాఖ జిల్లా బొబ్బిలి ఫ్లైఓవర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం సరిగా లేని పరిస్థితిలో ఉన్నట్లు అనుమానిస్తున్న ఆ యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా, అతని ప్యాంట్ మొత్తం రక్తంతో తడిసిపోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది యువకుడిని ప్రథమ చికిత్స నిమిత్తం బొబ్బిలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో వైద్యులు అతడికి చికిత్స ప్రారంభించేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్ర రక్తస్రావం జరుగుతున్నప్పటికీ యువకుడు చికిత్సకు సహకరించకపోవడం ఆందోళన కలిగించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ శశిభూషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. యువకుడు తన ఇంటి వివరాలు చెప్పేందుకు నిరాకరించడమే కాకుండా ఆస్పత్రి నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నించాడు. అతని వద్ద లభించిన మొబైల్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి ఇంకా పలు అనుమానాలు నెలకొన్నాయి. యువకుడు నిజంగానే తన మర్మాంగాన్ని తానే కోసుకున్నాడా? లేక ఈ దారుణానికి ఎవరైనా కారణమయ్యారా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్లే అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న అనుమానం ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ALSO READ: Big Alert: మూడు రోజులు జాగ్రత్త





