
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఇదొక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. తిరుపతి నుంచి తిరుమల కు వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేమని మంత్రి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. స్త్రీ శక్తి పథకాన్ని తిరుమలకు అమలు చేయకపోవడానికి గల కారణాలు కూడా వెల్లడించారు. నిత్యం తిరుమలకు ఎంతోమంది జనం వస్తుండడంతో ఎక్కువమంది తో కొండపైకి బస్సులు నడపడం అనేది చాలా ప్రమాదకరమని ఆమె అన్నారు. ప్రతిరోజు తిరుమల కు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో ఇక్కడ ఫ్రీ బస్సు పథకం ప్రారంభించడం కష్టమని అన్నారు. తిరుమల ఘాట్ రోడ్ లో పరిమితికి మించిన సంఖ్యలో ప్రయాణం చేయడం చాలా కష్టమని అన్నారు. కాదు అని పరిమితికి మించి ప్రయాణాలు చేస్తే బస్సులు అదుపు తప్పే అవకాశం ఉందని తెలిపారు. కానీ కొండపైకి వెళ్లాక అక్కడ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుంది అని మళ్లీ గుర్తు చేశారు.
Read also : ఉప్పల్‌లో ఉద్రిక్తత: రామంతాపూర్ విద్యుత్ ప్రమాదం ఘటనపై స్థానికుల ఆందోళన
ఇక తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఏ ఆర్టీసీ బస్సుల్లోను ఫ్రీ బస్ స్కీం వర్తించదని తాజాగా తిరుమల డిపో అధికారులు స్పష్టం చేశారు. సప్తగిరి ఎక్స్ప్రెస్, గరుడ ఏసీ , ప్యాకేజ్ టూర్ సహా మరి కొన్ని బస్సులకు ఈ పథకం వర్తించదు.. అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాన్ స్టాప్ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ పథకం లేదు. పల్లె వెలుగు, అల్ట్రాపల్లి వెలుగు, ఎక్స్ ప్రెస్ , మెట్రో ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చని తెలిపింది. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ స్త్రీ శక్తి పథకం.. పట్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆటో డ్రైవర్లు చాలానే నిరాశ చెందుతున్నారు.
Read also : ఉప్పల్‌లో ఉద్రిక్తత: రామంతాపూర్ విద్యుత్ ప్రమాదం ఘటనపై స్థానికుల ఆందోళన