హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద రేవతి అనే మహిళ చనిపోయిన సందర్భంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అల్లు అర్జున్ ఇంటిపై దాడికి దిగారు. హైదరాబాదులో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇంటిని ఓయూ మరియు జేఏసీ నాయకులు ఇంటి ముందు భాగంలో ఉన్నటువంటి పూల మొక్కలను వాటితో పాటుగా మరికొన్నిటిని నాశనం చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఆదుకోవాలని నినాదాలు చేశారు.
మందుబాబులకు గుడ్ న్యూస్!… భారీగా తగ్గిన ధరలు?
హైదరాబాదులోని అల్లు అర్జున్ ఇంటి గోడలు ఎక్కి మరీ లోపలకు దూసుకెళ్లారు. అనంతరం లోపల ఉన్నటువంటి పూల కుండీలు అన్నిటిని కూడా నాశనం చేశారు. బయట నుండి ఇంటి లోపలికి రాళ్లు కూడా విసరడంతో అల్లు అర్జున్ ఇంటి వద్ద గందరగోళం నెలకొంది. లోపలికి రానివ్వకుండా చాలామంది ఎక్కడ ఉన్నటువంటి వారు అడ్డుకున్న కానీ గోడలు దూకి మరీ చాలా మంది ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా నాశనం చేశారు.
టెస్ట్ ప్రాక్టీస్ లో గాయాలు!… జట్టును వీడనున్న రోహిత్, కేఎల్
ఓయూ మరియు జేఏసీ నాయకులు అందరూ కూడా అతని ఇంటి వద్ద బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ఇట్టి పరిస్థితుల్లోనూ రేవతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉండి పోరాడుతాము అని అన్నారు. అయితే ఈ దాడి సమయంలో అల్లు అర్జున్ కుటుంబంలోని వ్యక్తులు ఎవరు కూడా అక్కడ లేరు. మరి ఈ విషయం వారికి తెలుసో లేదో తెలియదు కానీ ప్రస్తుతం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అల్లు అర్జున్ హైలైట్ అయిపోయాడు.