
SHOCKING: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో స్నేహం, ప్రేమ, కోపం కలిసిపోయిన హృదయ విదారక సంఘటన బయటపడింది. తన చెల్లిని ప్రేమించాడనే కోపం యువకుడిని ఇంత ఘోరానికి నెట్టేసిందన్న విషయం స్థానికులను కూడా షాక్‌కు గురిచేస్తోంది. జునైద్ అనే యువకుడిని అతని సన్నిహిత స్నేహితుడయిన సన్నీ కాల్చి చంపడం భయానక వాతావరణాన్ని సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. సన్నీ చెల్లితో జునైద్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడని, ఇద్దరి మధ్య సంబంధం తీవ్రస్థాయికి చేరుకుందని సమాచారం. ఒక రోజు యువతి, జునైద్ కలిసి ఉన్న సమయంలో సన్నీ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. అభ్యంతరకరమైన స్థితిలో వారిని చూసిన సన్నీ.. ఆగ్రహానికి లోనై ప్రతీకార భావంతో జునైద్‌ను కిడ్నాప్ చేశాడు.
దీంతో జునైద్‌ని అడవికి తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపినట్లు విచారణలో బయటపడింది. జునైద్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించగా.. దర్యాప్తులో సన్నీ హత్య చేసినట్లు నిజం బయటపడింది. చివరకు సన్నీని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ALSO READ: Emotional: ప్రియుడి మృతి.. తట్టుకోలేక యువతి ఆత్మహత్య





