క్రైమ్

ప్రముఖ యాంకర్‌ సుమ భర్తకు షాక్… నటుడు రాజీవ్‌ కనకాలకు రాచకొండ పోలీసుల నోటీసులు

  • భూ వివాదంలో నోటీసులిచ్చిన పోలీసులు

  • పసుమాములలోని ఓ ప్లాట్‌ విషయంలో వివాదం

  • వెంచర్‌లో భాగస్వామిగా ఉన్న రాజీవ్‌ కనకాల

  • రాజీవ్‌ విక్రయించిన ప్లాట్‌పై కొనసాగుతున్న రాద్ధాంతం

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: ప్రముఖ యాంకర్‌ సుమ భర్త రాజీవ్‌ కనకాలకు రాచకొండ పోలీసులు షాకిచ్చారు. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని పసుమాములలోని ఓ ప్లాట్‌ విషయంలో పోలీసులు నోటీసులిచ్చారు.

వివరాల్లోకి వెళ్తే… పసుమాములలోని సర్వే నెంబర్‌ 421లో ఏర్పాటు చేసిన వెంచర్‌లో రాజీవ్‌ కనకాల భాగస్వామిగా ఉన్నారు. ఈ వెంచర్‌లోని ఓ ప్లాట్‌ను సినీ నిర్మాత విజయ్‌ చౌదరికి రాజీవ్‌ కనకాల విక్రయించి, రిజిస్ట్రేషన్‌ చేయించారు. కాగా, కొన్నాళ్ల తర్వాత ఇదే ప్లాట్‌ను ఎల్బీనగర్‌కు చెందిన శ్రవణ్‌ రెడ్డికి రూ.70లక్షలకు విజయ్‌ చౌదరి అమ్మారు. ఇక్కడే అసలు సమస్య స్టార్టయింది. ప్లాట్‌ను చదును చేసేందుకు వెళ్లిన శ్రవణ్‌ రెడ్డికి అక్కడ ప్లాట్‌ కన్పించలేదు. ఆ స్థలంలో ప్లాట్‌ కు సంబంధించిన ఆనవాళ్లే లేవు. దీంతో మోసపోయానని గ్రహించిన శ్రవణ్‌ రెడ్డి హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు నకిలీ ప్లాట్‌ను విక్రయించారని ఆరోపించారు.

దీనిపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి తప్పించుకు తిరుగుతున్నారని శ్రవణ్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. గట్టిగా నిలదీస్తే అంతు చూస్తానని విజయ్‌ చౌదరి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు… ఈ ప్లాట్‌ను మొదట విక్రయించిన రాజీవ్‌ కనకాలను పోలీసులు విచారణకు పిలిచారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

Read Also: 

  1. ఎస్పీ పవార్ ప్రత్యేక చొరవ, నల్లగొండలో సగానికి తగ్గిన రోడ్డు ప్రమాదాలు!
  2. లండన్ కు చేరిన ప్రధాని మోడీ.. కీలక అంశాపై ద్వైపాక్షిక చర్చలు!
Back to top button