
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు తమ సత్తాను చాటుకుంటున్నారు. అయితే వీరందరూ సినిమా కెరియర్ ప్రారంభించినప్పుడు ఏదో ఒక సమస్యను ఎదుర్కొనే ఉంటారు. కానీ ప్రతి ఒక్క హీరోయిన్ కూడా వాటి గురించి బయటకు ప్రస్తావించదు. అయితే తాజాగా సినిమా కెరీర్ ప్రారంభంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అంటూ యువ హీరోయిన్ చాందిని చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెరీర్ ప్రారంభంలో ఒక మూవీలో ముద్దు సీన్లలో నటించాలి అని తెగ ఒత్తిడి చేశారు అని అన్నారు. కథ చెప్పినంత సేపు ఒక్క ముద్దు సీన్ గురించి కూడా చెప్పలేదు అని.. ఆ తర్వాత మాత్రం ముద్దు సీన్లలో నటించాలని ఒత్తిడి చేశారు. నేను సినిమా తీస్తున్న సమయంలో అర్జున్ రెడ్డి సినిమా విడుదలై మంచి పాజిటివ్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో మా సినిమాలోనూ కూడా కిస్ సీన్లు పెడితే సూపర్ హిట్ అవుతుంది అని అందరూ కూడా అనుకోని నన్ను ఒత్తిడి చేశారు అని అన్నారు. సాధారణంగా ఏ దర్శకుడైన సరే చెప్పినట్లు చేయకపోతే వారికి చెడ్డపేరు వస్తుంది. అయితే వెంటనే ఆ సినిమాలో హీరో కూడా చేయనని చెప్పేయడంతో నాకు చాలా హ్యాపీ అనిపించిందని… హీరో వల్లనే ఆ సినిమాలో ఒత్తిడి కాస్త తగ్గింది అని చాందిని చౌదరి నిర్మొహమాటంగా తన సినిమా కెరీర్ ప్రారంభం విషయాలను పంచుకుంది.
Read also : కార్యకర్తకు కష్టం వస్తే అర్ధగంటలో వాలిపోతా : KTR
Read also : CM Stalin: బిహార్ ఫలితం.. ఇండియా కూటమికి పాఠం





