
Shashi Tharoor Differs With Rahul Gandhi: భారత్ మీద 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా నుంచి ఆయుధాలు, ఆయిల్ కొనుగోలు చేయడంపై సీరియస్ అయ్యారు. భారత్ తో రష్యా ఏం చేస్తుందనేది తమకు అవసరం లేదన్న ఆయన.. వారిద్దరూ మునిగిపోతుంటే తమకెందుకు అన్నారు. పనిలో పనిగా భారత్, రష్యా దేశాలవి ‘డెడ్ ఎకానమీ’ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ను రాహుల్ గాంధీ సమర్థించారు. పతనమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను అభివర్ణించడం నిజమే అన్నారు. యావత్ ప్రపంచానికి ఈ విషయం తెలుసన్నారు.
రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన శశిథరూర్
ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ సమర్థిస్తే.. ఆ పార్టీ ఎంపీ శిశిథరూర్ ఖండించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ కానేకాదన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. ట్రంప్ టారిఫ్ సీరియస్ అంశమన్న ఆయన.. 25 శాతం టారిఫ్ పెంపు, పెనాల్టీలతో కలిసి మొత్తం సుంకం 35-45 శాతం వరకూ ఉండొచ్చన్నారు. ఇది మన ఎగుమతులకు నష్టం కలిగిస్తుందన్నారు. అమెరికాలో మనకు పెద్ద మార్కెట్ ఉందన్నారు. కాంగ్రెస్‌కు శశిథరూర్ దూరం జరుగుతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ‘డెడ్ ఎకానమీ’ విషయంలో రాహుల్ అభిప్రాయానికి భిన్నంగా శశిథరూర్ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.