హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ః అమెరికాతో ఇరాన్ చర్చలు విఫలమవడం మళ్లీ గల్ఫ్‌లో ఉద్రిక్తలు పెరగడంతో మళ్లీ బంగారం పై తీవ్ర ప్రభావం పడనుంది. యుఎస్, ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలోభాగంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. సగటున 2,800ల మేర పెరిగింది. మళ్లీ గల్ప్‌లో ఉద్రిక్తలు చెలరేగడంతో ఈ వారం ధరలు తీవ్రంగా అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
సోమవారం (ఏప్రిల్ 13) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,090ల వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2,64,900 పలుకుతోంది. విజయవాడలో కూడా దాదాపు ఇవే రేట్స్ ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా రూ.1,53,810ల వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.1,52,830గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,40,990గా, ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.1,40,090ల వద్ద కొనసాగుతోంది.
ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.2,64,990గా ఉంది. ముంబైలో రూ.2,59,900ల వద్ద కొనసాగుతోంది. ఇతర నగరాల్లో కూడా వెండి ధర దాదాపు ఇదే రేంజ్‌లో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 4,677 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 73 డాలర్లుగా ఉంది. బంగారం కొనుగోలు దారులు ధరలు తెలుసుకొని తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.
