
-
సొంత గ్రామంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
-
పార్టీ కోసం ఎనిమిదేళ్ల కష్టపడ్డానని నాగిరెడ్డి ఆవేదన
-
ఏఎంసీ చైర్మన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగిరెడ్డి
-
అప్పటి నుంచి తనపై ఒత్తిడి తెస్తున్నారని మనస్తాపం
-
కాంగ్రెస్ గ్రామ అధ్యక్ష పదవికి నాగిరెడ్డి గుడ్‌బై
క్రైమ్ మిర్రర్, వరంగల్: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు. తాజాగా యశస్వినిరెడ్డి స్వగ్రాం తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఝాన్సిరెడ్డికి పంపారు.
మనస్తాపం చెందే రాజీనామా చేస్తున్నా: నాగిరెడ్డి
గత ఎనిమిదేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని లేఖలో నాగిరెడ్డి ప్రస్తావించారు. ఎమ్మెల్యే గెలుపు కోసం రేయింబవళ్లు కృషి చేశామన్నారు. బయట నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీని నిలబెట్టామన్నారు నాగిరెడ్డి. గ్రామంలో ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా విజయవంతం చేశామన్నారు. కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్‌తో కలిసి వేరే మండలంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనను మందలించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వగ్రామంలో అభివృద్ది పనుల కోసమే అతనితో కలిసి ప్రోగ్రామ్‌లో పాల్గొనాల్సి వచ్చిందని వెల్లడించారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర జరిగిన గొడవకు తనకు సంబంధం లేదన్నారు నాగిరెడ్డి. ఈ గొడవతో మనస్తాపం చెందే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఆయన చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి: