కామారెడ్డి, క్రైమ్ మిర్రర్: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం చోటచేసుకుంది. భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి వద్ద 44వ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్‌ను వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న పేషెంట్ సలేహ భాను(63), అంబులెన్స్ డ్రైవర్ షేక్ సర్దార్ (35) ఘటనా స్థలిలోనే మృతి చెందారు. పేషెంట్ భర్త సైఫుల్లా ఖాన్ (76) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
స్వగ్రామానికి తరలిస్తున్న సమయంలో ఘటన…
సలేహాభాను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నుంచి స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వెనుక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో అంబులెన్స్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌పై నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంతో NH-44పై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
