
-
రూ.11కోట్ల నగదు, భారీగా మద్యం స్వాధీనం
-
శంషాబాద్ సమీపంలోని సులోచన ఫార్మ్‌హౌస్‌లో సిట్ సోదాలు
-
12 అట్టపెట్టెల్లో రూ.11కోట్లు దాచిన నిందితులు
-
ఏ 40 వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు
-
పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా కాచారంలో తనిఖీలు
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: ఏపీ మద్యం కుంభకోణం కేసులో సంచలనం చోటు చేసుకుంది. శంషాబాద్ సమీపంలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో సిట్ అధికారులు భారీగా నగదు, మద్యం నిల్వలున్న డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏ40గా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం మేరకు తనిఖీలు చేపట్టిన సిట్ అధికారులు శంషాబాద్ సమీపంలోని కాచారం సులోచన ఫార్మ్‌హౌస్‌లో సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా 12 అట్టపెట్టెల్లో దాచిన రూ.11కోట్ల నగదు, భారీగా మద్యాన్ని సీజ్ చేశారు. దీంతో హైదరాబాద్‌లోని మరో 10 ప్రాంతాల్లో సిట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రోజురోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా ఏ40 వరుణ్ పురుషోత్తం నోటి వెంట సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏ1 రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకే అంతా చేసినట్లు వెల్లడించారు. ఆయన సూచనల మేరకే 2024 జూన్‌లో ఏ12 చాణక్య, తాను కలిసి సులోచన గెస్ట్ హౌస్‌లో నగదు దాచినట్లు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేసిన సిట్ బృందం డంప్‌ను స్వాధీనం చేసుకుంది.
Read Also: