జాతీయం

Sonia Gandhi: హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ, అసలు ఏమైందంటే?

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ హాస్పిటల్లో చేరారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించింది.

Sonia Gandhi Admitted In Ganga Ram Hospital: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. సోనియ గాంధీ శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోనియా గాంధీ కూడా చాలా కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.

పొల్యూషన్ పెరిగిన ప్రతిసారి శ్వాస సమస్యలు

ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరిగిన ప్రతి సారి ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కూడా ఢిల్లీలో చలి తీవ్రత పెరగడం, పొల్యూషన్ కూడా భారీగా పెరగడంతో సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్లారు. రొటీన్ చెకప్‌లో భాగంగానే సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరినట్లు హాస్పిటల్ సిబ్బంది చెబుతున్నారు. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉన్న సమయంలో సోనియా రెగ్యులర్ చెకప్‌ల కోసం క్రమం తప్పకుండా ఆస్పత్రికి వస్తారని అధికారులు తెలిపారు.

సోనియాకు ఏమైంది?  

సోనియా గాంధీకి ప్రస్తుతం 79 ఏళ్లు నిండాయి. వయోభారంతో పాటు.. ఆమె పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ఉదర సంబంధిత సమస్యతో ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆ తరువాత జూన్‌లోనూ ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ తరువాత కూడా సోనియా గాంధీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button