
యాదాద్రి భువనగిరి జిల్లా, క్రైమ్ మిర్రర్ :- సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో సీపీఐ మండల నాయకుడు మాజీ ఎంపీపీ ఎల్లంకి శ్రీనివాస్ 10 వ వర్ధంతి ని ఆయన స్థూపం వద్ద పూలమాలలు వేసి జోహార్లు అర్పించి ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి సభలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ శ్రీనివాస్ నిస్వార్ధ గల కమ్యూనిస్టు నాయకుడు అని మాట్లాడారు. సాధారణ కుటుంబంలో పుట్టినా, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన జీవితం యువత కు ఆదర్శమని సమాజానికి వెలుగు పంచేదిశగా శ్రీనివాస్ ఆశయాలు కొనసాగించాలని తెలిపారు. ఈ గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గుండు కిష్టయ్య, కురుమిద్ద లింగయ్య లతో కలిసి భూ పోరాటాలు నిర్వహించి అప్పటి ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు చొరవతో అల్లందేవి చెరువు గ్రామంలో ఇంటి నిర్మాణాలు చేయించారని గుర్తు చేశారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బచ్చనగోని గాలయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కే శ్రీనివాస్, సిపిఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కలకొండ సంజీవ, సీపీఐ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ దేశిడి నరేందర్ రెడ్డి,సురవి నరసింహ, గుండు నరసింహ, పొట్ట శంకరయ్య, పల్లె మల్లారెడ్డి, ముత్యాల అంజయ్య, ఎర్రోళ్ల లింగస్వామి, బద్దుల పెంటయ్య, ఈద మల్లయ్య, గడ్డం యాదగిరి, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read also : ఆర్ఎంపీ వైద్యం వికటించి విద్యార్థిని మృతి!
Read also : నో షేక్ హాండ్స్.. నో హగ్స్.. టీమిండియాను మెచ్చుకుంటున్న అభిమానులు!