
క్రైమ్ మిర్రర్, పెద్దపల్లి:- రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ కేంద్రం లోని రేపు 4న నిర్వహించనున్న నీట్ నిర్వహణకు మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన 04 పరీక్ష కేంద్రాలు తెలంగాణ ఆదర్శ పాఠశాల రాజీవ్ నగర్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, డిగ్రీ కాలేజ్ లోని పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారితో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. మంచిర్యాల్ లో నాలుగు సెంటర్లలో నీట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. నీట్ పరీక్ష ను ప్రశాంతమైన వాతావరణం లో నిర్వహించడం లో భాగంగా సెంటర్లను విజిట్ చేయడానికి రావడం జరిగింది అన్నారు. నాలుగు సెంటర్లలో 1224 మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఏరియాలలో 163 బిఎన్ఎస్ఎస్ ప్రకారం నలుగురు కంటే ఎక్కువ మంది ఉండకుండా చూస్తాము. సెక్టార్ సూపర్డెంట్ తో మాట్లాడడం జరిగింది. లోపల ఉన్న అన్ని సిస్టమ్స్ ఇన్విజి లెటర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ లను కమిటీ ద్వారా ఇస్తారు. పోలీస్ సిబ్బంది జాగ్రత్తగా బయట వారిని తనిఖీ చేసి లోపలికి పంపడం జరుగుతుంది. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్త్ పటిష్టంగా ఏర్పాటు చేస్తాము అని సీపీ గారు తెలిపారు. విద్యార్థులు సెంటర్‌లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లొద్దని, విద్యార్థులకు తల్లితండ్రులు పరీక్ష కేంద్రాలకు అనుమతి సమయం కన్నా ముందుగా వచ్చి పోలీస్ వారికీ సహకరించగలరు అని సూచించారు.
ఈ కార్యక్రమం లో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఇన్స్పెక్టర్ పూరషోత్తం తదితరులు పాల్గొన్నారు.
డ్వాక్రా మహిళలకు పెద్దపీట వేసిన ఏపీ ప్రభుత్వం!.. డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా యాప్ ప్రారంభం?