
Schools Reopen: వేసవి సెలవులు ఇవాళ్టితో ముగియనున్నాయి. రేపటి నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ కానున్నాయి. సుమారు నెలన్నర పాటు సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ చేసిన విద్యార్థులు, రేపటి నుంచి భుజానికి బ్యాగులు తగిలించుని స్కూల్స్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, బ్యాగులు, టిఫిన్ బాక్సులు, బాటిళ్లు కొనుగోలు చేసేందుకు స్టాల్స్ కు వెళ్తున్నారు. స్కూల్ సామాగ్రి అమ్మే దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
స్కూల్స్ అందంగా ముస్తాబు
విద్యార్థులను స్కూల్ కు ఆహ్వానించేందుకు ఉపాధ్యాయులు స్కూల్స్ ను అందంగా ముస్తాబు చేస్తున్నారు. తరగతి గదులను డెకరేషన్ చేస్తున్నారు. ఇవాళ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు స్కూల్స్ కు వెళ్లి పరిసరాలను శుభ్రం చేయించనున్నారు. ఇప్పటికే, పలు స్కూల్స్ ప్రారంభం కానుండగా, రేపటి నుంచి అన్ని పాఠశాలలు ఓపెన్ కానున్నాయి. మరోవైపు ఆయా పాఠశాలలకు సంబంధించి వాహనాల ఫిట్ నెస్ టెస్టులు చేయించుకుంటున్నారు. అన్ని బస్సులు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆర్టీఏ అధికారులు సూచించారు. లేదంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
జూన్ 12 నుంచి బస్ పాసుల జారీ
అటు స్కూల్స్ ఓపెన్ కానున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థులకు బస్ పాసుల జారీ గురువారం నుంచి మొదలవుతుందని వెల్లడించారు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పాసులను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని పలు ఆర్టీసీ కేంద్రాల్లో పాసులు జారీ చేయనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ వెల్లడించారు. ఆరాంఘర్, అఫ్జల్ గంజ్, బాలానగర్, బోరబండ, సీబీఎస్,చార్మినార్, దిల్ సుఖ్ నగర్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, ఫరూక్ నగర్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, జేబీఎస్, కాచిగూడ, కోటి, కేపీహెచ్‌బీ, కూకట్ పల్లి, లక్డీకాపూల్, ఎల్‌బీనగర్, లింగంపల్లి, లోతుకుంట, మేడ్చల్, మెహిదీపట్నం, మిథాని, మొయినాబాద్, ఎన్‌జీఓ కాలనీ, పఠాన్ చెరు, రైతిఫై, సికింద్రాబాద్, ఆర్‌జీఐ ఎయిర్ పోర్ట్, సనత్ నగర్, సెక్రటేరియట్, శంషాబాద్, ఎస్‌ఆర్ నగర్, షాపూర్ నగర్, తార్నాక, ఉప్పల్, ఉమెన్స్ కాలేజీ కేంద్రాల్లో పాసులు తీసుకోవచ్చని వెల్లడించారు.
Read Also: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్, ఏం చెప్పబోతున్నారంటే?