Tuesday, March 24, 2026
Homeక్రైమ్Big breaking: క్రిస్టియ‌న్‌లోకి మారితే ఎస్సీ హోదా ర‌ద్దు....సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు....

Big breaking: క్రిస్టియ‌న్‌లోకి మారితే ఎస్సీ హోదా ర‌ద్దు….సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు….

న్యూఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: మ‌తం మారిన ఎస్సీ వారికి సంబంధించి సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రిచింది. క్రైస్త‌వం మ‌తంలో మారాక ఇక ఎస్సీ హోదా వ‌ర్తించ‌ద‌ని పేర్కంది. హిందు, సిక్కు, బౌద్ధ మ‌తాలు కాకుండా ఇత‌ర మ‌తాల్లోకి మారితే ఎస్సీ హోదా వ‌ర్తించ‌ద‌ని స‌ర్వోన్న‌త న్యాయ స్థానం పేర్కొంది.జస్టిస్ ఎన్వీ అంజారియా, జ‌స్టిస్ ప్ర‌శాంత్‌కుమార్‌ల‌తో కూడిన ద‌ర్మాస‌నం ఈ మ‌ర‌కు తీర్పు వెలువ‌రించి ఇదే వ్య‌వ‌హారంలో గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌మ‌ర్థించింది.

క్రైస్త‌వ మతంలో కుల వ్య‌వ‌స్థ‌కు తావులేదు…

క్రైస్త‌వ వ్య‌వ‌స్థ‌లో కుల వ్య‌వ‌స్థ‌కు తావు లేద‌ని, అట్రాసిటి చ‌ట్టం కింద ఫిర్యాదు చేసే హ‌క్కు ఉండ‌ద‌ని ధ‌ర్మాస‌నం తాజాగా పేర్కొంది. గుంటూరు జిల్లా పిట్ట‌ల‌వానిపాలెంఓ పాస్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న వ్య‌క్తిపై దాడికి సంబంధించి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటి కింద న‌మోదైన కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది. ఫిర్యాదుదారుడు దశాబ్ద కాలంగా పాస్టర్‌గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. క్రైస్త‌వంలో ఉంటూ అట్రాసిటి కింద ఫిర్యాదు చేసే హ‌క్కు ఉండ‌ద‌ని పేర్కొంది.

కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఉన్న మ‌తం మార్పిడి త‌రువాత దానికి ర‌క్ష‌ణ ఉండ‌దు…

ఫిర్యాదుదారుడికి తహశీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, మత మార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. క్రైస్తవ మతంలోకి మారి, ఆ ఆచారాలను పాటిస్తున్న వ్యక్తి షెడ్యూల్డ్ కుల సభ్యుడిగా కొనసాగలేరని స్పష్టం చేసింది. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్, 1950 ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద రక్షణ లభించదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments