
HCU కంచ గచ్చిబౌలి భూములపై సంచలన విషయాలు బైటపెడుతూ సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC). HCU కంచ గచ్చిబౌలి భూముల మార్టగేజ్ వెంటనే ఆపాలని నివేదిక ఇచ్చింది CEC. పాత పత్రాలు మరియు ఒప్పందాలు పరిశీలించిన తర్వాత కంచ గచ్చిబౌలి భూమికి చట్టబద్ధమైన యజమాని హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH)గా CEC గుర్తించింది.కంచె గచ్చిబౌలి భూముల సర్వ హక్కులు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కే ఉన్నాయని అభిప్రాయ వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టుకు నివేదిక అందించింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ
ప్రభుత్వం ఈ భూమిని పూర్తిగా న్యాయ పరిశీలన చేయకుండా TGIICకి బదిలీ చేయడం వల్లే ఇన్ని సమస్యలు తలెత్తాయని నివేదికలో తెలిపింది CEC. TGIIC భూమిపై తనఖా పెట్టి ఈ ప్రాంతం యొక్క పర్యావరణ ప్రాముఖ్యతను సరిగ్గా పరిగణనలోకి తీసుకోకుండా అభివృద్ధి ప్రణాళికలను ప్రారంభించడం అత్యంత ప్రమాదకరమని తెలిపింది. ICICI బ్యాంకుకు మార్ట్ గేజ్ చేసిన HCU భూముల్లో ఒక లేక్ (కొలను) కూడా ఉందని, ఆ భూములు చట్టపరంగా HCUకే చెందుతాయని రిపోర్టులో పేర్కొన్నది CEC
Also Read : ఇళ్ల నుంచి బయటకు రావొద్దు జాగ్రత్త – ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..
కొన్ని సంవత్సరాల క్రితం ఆ 400 ఎకరాల భూమిలోని ఓ 5 ఎకరాలలో HCU నిర్మించిన భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇది సాధ్యం కాదు కదా అని నివేదికలో వెల్లడించింది CEC.కంచె గచ్చిబౌలి భూములను సాంకేతికంగా అడవిగా గుర్తించకపోయినా అడవికి ఉండాల్సిన అన్ని లక్షణాలు కంచె గచ్చిబౌలికి ఉన్నాయని CEC నివేదికలో వెల్లడించింది.ఈ అడవి ఎనిమిది జాతుల షెడ్యూల్డ్ జంతువులకు నిలయంగా ఉన్నట్టు తెలిపింది. సైట్ సందర్శించిన సమయంలో, తొలగించాల్సిన ప్రాంతం యొక్క సరైన సరిహద్దును అధికారులు సరిగ్గా గుర్తించలేదని వెల్లడించింది.
Also Read : ఏప్రిల్ 21న తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
ఇటువంటి అటవీ ప్రాంతాలను సమర్థవంతంగా గుర్తించడానికి.. అనుభవం ఉన్న అధికారులు, పర్యావరణ పరిజ్ఞానం ఉన్న వన్యప్రాణుల నిపుణులు, జియోస్పేషియల్ మ్యాపింగ్ మరియు డేటా విశ్లేషణ కోసం IT నిపుణులు పాల్గొనడం చాలా అవసరమని సీఈసీ తన నివేదికలో అభిప్రాయపడింది. ఏ మాత్రం ప్రణాళిక లేకుండా.. నిర్లక్ష్యంగా, ఏకపక్ష పద్ధతిలో చెట్లను నరికివేశారని ఆరోపించింది. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా చెట్లు కొట్టేయడానికి పూనుకున్నట్టు, కుట్రపూరితంగానే దురుద్దేశంతో అరకొర అనుమతులతో టీజీఐఐసీ పనులు మొదలు పెట్టినట్టు వెల్లడించింది. ఏ విధమైన హద్దులు గీయకుండా ఇష్టానుసారంగా, హడావుడిగా 400 ఎకరాలు చదును చేసేందుకు పనులు మొదలు పెట్టినట్లు సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో కేంద్ర కమిటి స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..