
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పుర్ ప్రతినిధి:-
సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు కావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో, దేవాదాయ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారుల బృందం ప్రయాగ్రాజ్ వెళ్లి మహాకుంభమేళా నిర్వహణ తీరును అధ్యయనం చేసి వచ్చింది. కోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేసిన విధానాన్ని పరిశీలించింది.
శాఖ వచ్చే ఏడాది, ఆపై సంవత్సరం గోదావరి, కృష్ణా పుష్కరాలు నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు ఉన్నాయి. గోదావరి, కృష్ణా పుష్కరాలకు ముందు ప్రారంభంకానున్న సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ, పుష్కరాలకు అతి ముఖ్యమైన నదీ జలాలే లేకుంటే ఎలా అని అధికారులు తర్జనభర్జనలో మునిగిపోయారు. తాజాగా దేవాదాయశాఖ ఉన్నతాధికారులు నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ అయి దీనిపై చర్చించారు.