తెలంగాణ

రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు.. ఇలా చేస్తే పుణ్యం వస్తుంది..

సరస్వతీ పుష్కరాలకు కాలేశ్వరం క్షేత్రం ముస్తాబయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమ ప్రాంతం లో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుండి ఈ నెల 26 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. గోదావరి, ప్రాణహిత నదుల కలయిక తో కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం ఏర్పడింది. గోదావరి, ప్రాణహిత నదుల అంతర్వాహిని గా సరస్వతి నదీ ప్రవహిస్తోంది.

కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం లో రేపు ఉదయం 5:40 నిమిషాలకు సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతులు గురు మాధవానంద సరస్వతీ స్వామి, మాధవానంద స్వామి చేతులమీదుగా ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు గోదావరి ఒడ్డున 40 కాటేజీలను ఏర్పాటు చేశారు.

విపత్తులు సంభవించకుండా ఉండేందుకు NDRF 34 మంది సిబ్బంది, SDRF 66 మంది సిబ్బంది, అలాగే సింగరేణి, రెస్క్యూ టీములను కూడా ఏర్పాటు చేశారు. మల్టీజోన్ వన్ నుండి సుమారు 3,500 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. 200 సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో కంట్రోలింగ్ సిస్టం అనుసంధానం చేయనున్నారు. భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుండి 70 ప్రత్యేక బస్సులు 47 సర్వీసులు రోజుకు 130 ట్రిప్పులు. మొత్తం 14 పార్కింగ్ స్థలాలు, 7 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ వరంగల్ నుండి వచ్చే వాహనాలు కాటారం మండలం గంగారం ఎక్స్ రోడ్ మీదుగా కాలేశ్వరం చేరుకుంటాయి. అలాగే మహారాష్ట్ర చతీస్గడ్ నిర్మల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నుంచి వచ్చే వాహనాలు.. సిరోంచ మీదుగా కాలేశ్వరం చేరుకోనున్నాయి. పుష్కర పనులను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ దగ్గరుండి మరీ పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button