జాతీయంసినిమా

Samyukta Menon: ఈ లక్కీ హీరోయిన్ చేతిలో ఏకంగా 9 సినిమాలు!

Samyukta Menon: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించాలని కోరుకునే ప్రతి నటికి తెలుగు సినిమా ద్వారానే పెద్దస్థాయి గుర్తింపు వస్తుందనేది గత ఎన్నో సంవత్సరాలుగా రుజువవుతూ వస్తోంది.

Samyukta Menon: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించాలని కోరుకునే ప్రతి నటికి తెలుగు సినిమా ద్వారానే పెద్దస్థాయి గుర్తింపు వస్తుందనేది గత ఎన్నో సంవత్సరాలుగా రుజువవుతూ వస్తోంది. ఈ నిజాన్ని మరోసారి నిరూపించిన స్టార్‌బ్యూటీ సంయుక్త మీనన్‌. మలయాళం నుంచి వచ్చిన ఈ నాజూకు నటి.. పెద్ద హీరోలకు జత కట్టకపోయినా, ఒక్కసారిగా క్రేజీ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగింది. ప్రస్తుతం చేయాల్సిన చేతి నిండా సినిమాలు ఉండగా, ఒకేసారి తొమ్మిది సినిమాలతో బిజీగా మారి, ఇండస్ట్రీ మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, ఈ తొమ్మిదిలో ఏడు పాన్‌ ఇండియా ప్రాజెక్టులు కావడం ఆమె మార్కెట్ ఎంత పెరిగిందో స్పష్టంగా తెలియజేస్తోంది.

సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులకు భీమ్లా నాయక్ ద్వారా పరిచయమైంది. పవన్‌ కళ్యాణ్‌- రానా కాంబినేషన్‌లో వచ్చిన ఆ చిత్రంలో ఆమె చిన్న పాత్రే చేసినా.. ప్రేక్షకులకి బాగా నచ్చింది. ఆ తర్వాత ఆమె కెరీర్‌ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుసగా వచ్చిన హిట్స్‌ ఆమెను టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా నిలబెట్టాయి. సార్, బింబిసార, విరూపాక్ష వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలు వరుసగా రావడంతో సంయుక్తకు మంచి క్రేజ్ వచ్చింది. మలయాళంలో 15 సినిమాలు చేసినా రాని గుర్తింపును ఒక్క తెలుగు భీమ్లా నాయక్ తీసుకువచ్చిందంటే అది ఆశ్చర్యకరం కాదు.

తెలుగు విజయాలతో ఉత్సాహం పెరిగిన సంయుక్త తమతమ ఇండస్ట్రీల్లో అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టింది. తమిళం, కన్నడలో నటించే చాన్స్ రావడంతో పాటు, బాలీవుడ్‌లోకి మహారాగిణి చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఒకే సమయంలో నాలుగు ఇండస్ట్రీల్లో పని చేసే అరుదైన హీరోయిన్లలో ఇప్పుడు సంయుక్త కూడా చేరిపోయింది.

ప్రస్తుతం తెలుగులో ఆమెకు భారీ లైనప్ ఉంది. నిఖిల్‌తో స్వయంభు, శర్వానంద్‌తో నారి నారి నడుమ మురారి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో హైందవ వంటి ప్రాజెక్టుల్లో ప్రధాన పాత్రలు చేస్తున్న ఆమె.. మోహన్‌లాల్‌తో రామ్ చిత్రంలో మలయాళ ప్రేక్షకులకు మరోసారి చేరబోతుంది. తమిళంలో బెంజ్ మూవీలో నటిస్తోంది. బాలకృష్ణతో కలిసి యాడ్స్‌లో కనిపించిన సంయుక్త, ఇప్పుడు అఖండ- 2లో కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. అంతేకాదు, పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న బైలింగ్వల్ చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి నటించే అవకాశాన్ని కూడా అందుకుంది.

సంయుక్త ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ జానర్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ది బ్లాక్ గోల్డ్’ సినిమా పోస్టర్ చూస్తేనే యాక్షన్‌ హీరోయిన్‌గా మారడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చేతిలో తొమ్మిది సినిమాలు ఉండగా, అందులో ఏడు సినిమాలు పాన్ ఇండియా కావడం ఈ అమ్మడి రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి సరిపోతుంది. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో సంయుక్త ఒకరికే స్థానముందని చెప్పాలి.

ALSO READ: T20 World Cup 2026: భారత్ ఈ జెర్సీతోనే బరిలోకి దిగేది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button