
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ రోజు రోజుకి అభివృద్ధిలో వేగం పెంచుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిరోజు కూడా కొన్ని అంశాలపై తీవ్రంగా చర్చిస్తున్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దాలని ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ తాజాగా తల్లికి వందనం పథకం గురించి చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. మే నెలలో విద్యార్థులకు తల్లికి వందనం పథకం కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఒక్కొక్క విద్యార్థికి 15 వేల రూపాయల చొప్పున ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అందిస్తామని తెలిపారు. ఇక జూన్ నెలలో పాఠశాలలు తెరిచేలో గాని ఎకౌంట్ లో డబ్బులు వేస్తామని తెలిపారు.
అంతేకాకుండా రాష్ట్రంలో రెండు లక్షల మంది AI ప్రొఫెషనల్స్ ను తయారు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇందుకుగాను మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పాలనంతా కూడా వాట్సాప్ గవర్నెన్స్ లో జరుగుతోంది అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మరోవైపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే విడుదల చేస్తామని నేడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో మెల్లిమెల్లిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలు అలాగే నిరుద్యోగుల కష్టానికి ప్రతిఫలం దక్కేటువంటి అవకాశం ఉంది. దీంతో కూటమి సర్కార్ పై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాబట్టి ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు… నిర్విరామంగా ప్రజలకు కృషి చేస్తూ బాధ్యతగా పనిచేయాలని సీఎం హెచ్చరించారు.