
Saina Nehwal Divorce: స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసుకుంది. భర్త పారుపల్లి కశ్యప్ తో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఏడేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. “కొన్నిసార్లు జీవితం మనల్ని వేరు వేరు దార్లలోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచనల తర్వాత నేను పారుపల్లి కశ్యప్ తో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకోసం పీస్, గ్రోత్ ను కోరుకుంటున్నాం. ఈ కష్ట సమయంలో మమ్మల్ని అర్థం చేసుకుని, మా ప్రైవసీని గౌరవిస్తున్నందుకు థ్యాంక్స్” అని చెప్పుకొచ్చింది.
విడాకులపై స్పందించని కశ్యప్
విడాకులు గురించి సైనా కీలక ప్రకటన చేసినా, కశ్యప్ మాత్రం ఇంకా స్పందించలేదు. త్వరలోనే ఆయన ఈ విడాకులకు సంబంధించి ప్రకనట చేసే అవకాశం ఉంది.
20 ఏళ్ల ప్రేమ.. 7 ఏళ్ల వివాహ బంధం
ఇక పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ సుమారు రెండు దశాబ్దాలుగా ప్రేమించుకున్నారు. 1997లో ఓ బ్యాడ్మింటన్ క్యాంప్ లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. 2002లో ఇద్దరూ ఒకే చోట బాడ్మింటన్ ట్రైనింగ్ తీసుకుఉన్నారు. 2004 నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ ఇద్దరూ ప్రముఖ బాట్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. డిసెంబర్ 14, 2018లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల ప్రేమ.. ఏడేళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెప్తూ విడిపోతున్నారు. వీరి విడాకులకు కారణం ఏంటి? అనే విషయాన్ని మాత్రం బయటకు వెళ్లడించలేదు. త్వరలోనే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: అంతరిక్షం నుంచి శుభాన్షు తిరుగు ప్రయాణం, భూమ్మీద దిగేది ఎప్పుడంటే?