
రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 10 ఎకరాల వరకు కటాఫ్ పెట్టాలని డిసైడ్ అయింది. 10 ఎకరాల వరకు అందరికి డబ్బులు రిలీజ్ చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. ఈ నెల 31 వరకు పూర్తి స్థాయిలో డబ్బులు రిలీజ్ చేస్తామని ఇప్పటికే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దీంతో ఈనెల ముగిసేందుకు మరో ఆరు రోజుల మాత్రమే ఉంది.
ఇప్పటి వరకు మూడు ఎకరాలకు రైతు భరోసా వేసింది సర్కార్. దాదాపు 2 వేల 5 వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. 10 ఎకరాల వరకు అందిరికి ఈనెల 31 లోపు ఇవ్వాలంటే.. రోజుకో ఒక ఎకరం వరకు రైతు భరోసా వేసే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా నెలాఖరుకల్లా రైతు భరోసాకు సరిపడ డబ్బులు సర్దుబాటు చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆర్థికశాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో LRS క్లియరెన్స్ నడుస్తోంది. లక్షలాది మంది రైతులు డబ్బులు కట్టి తమ భూములను రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. దీంతో ఆ డబ్బులను రైతు భరోసాకి కింద రైతులకు అందించబోతోంది రేవంత్ సర్కార్.
ఇవి కూడా చదవండి ..
-
LRSపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..రిజెక్ట్ చేసిన వారికి అపిలేట్ అధారిటిలో ఆపిల్
-
నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ?
-
నెల రోజులైనా దొరకని కార్మికులు..SLBC టన్నెల్ క్లోజేనా?
-
ప్రేమించిన యువతి మృతి చెండడంతో- మనస్థాపంతో యువకుడి ఆత్మహత్యయత్నం
-
జులైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు – ఆ తర్వాత స్థానిక సంస్థలకు..!