
-
విచారణ వేగవంతం చేసిన పోలీసులు
-
10 పోలీసు బృందాలతో ముమ్మర దర్యాప్తు
-
ప్రొఫెషనల్ దొంగల ముఠా పనిగా అనుమానం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన భారీ చోరీ కలకలం రేపుతోంది. గుర్తు తెలియని దుండగులు రూ. 1.07 కోట్ల నగదును ఎత్తుకెళ్లిన ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, సీసీ కెమెరాల డీవీఆర్ సైతం దొంగలు ఎత్తుకెళ్లడం, ఈ చోరీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించినట్లు సూచిస్తోంది. దుండగులు ప్రముఖ ప్రొఫెషనల్ దొంగలే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నెల 10న రాత్రి సమయంలో ఈ చోరీ జరిగింది. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఇన్‌స్టిట్యూట్, ఫార్మసీ, ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించిన మొత్తంగా రూ.1.07 కోట్లు సిబ్బంది కార్యాలయంలోని బీరువాలో ఉంచి తాళం వేసి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం సిబ్బంది వచ్చేసరికి తలుపు తాళం పగులగొట్టి ఉండగా, బీరువాలో ఉన్న నగదు పూర్తిగా కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే కాలేజ్ సిబ్బందిని విచారించినట్లు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, దొంగలు చక్కగా ప్రణాళిక సిద్ధం చేసుకుని, సీసీ ఫుటేజ్ ఆధారాలు లేకుండా డీవీఆర్ ఎత్తుకెళ్లారు. ఇది సాధారణ దొంగతనం కాదని, అనుభవజ్ఞుల పని అని భావిస్తున్నాం, అని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కళాశాలలో రూ.1.07 కోట్లు చోరీ, సీసీ కెమెరాల డీవీఆర్ కూడా దొంగతనం.. పది పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభం ప్రొఫెషనల్ దొంగల పని అయి ఉండొచ్చని అనుమానం ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.