తెలంగాణ

పేదింటి బిడ్డకు రాజన్న వైద్యం

క్రైమ్ మిర్రర్, మునుగోడు:- రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన కొద్ది మొత్తానికి తోడు, లక్షల రూపాయలు అప్పులు చేసి చికిత్స చేయించినా బిడ్డ కదలకపాయే మెదలకపాయె ఎవరిని గుర్తుపట్టక పాయె. తమ కష్టం పగోడికి కూడా రావదంటూ, మొక్కని దేవుడు లేడు తలవని దేవత లేదు. మాకు ఎవరు దిక్కు రా దేవుడా అంటూ ఎదురుచూస్తున్న తరుణంలో, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, ఇచ్చిన భరోసా ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నీ కొడుకును కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించి, మెరుగైన చికిత్స అందిస్తానని రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన హామీతో బిడ్డపై ఆశలు మళ్ళీ చిగురించాయి.

ఇచ్చిన హామీ ప్రకారం గురువారం యశోద ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ఇక వివరాలలోకి వెళ్తే, మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలోని యరుగండ్లపల్లి గ్రామానికి చెందిన, చామకూరి తిరుపతయ్య రెండు సంవత్సరాల క్రితం కుటుంబంతో గొడవపడి, ఆవేశంతో పాయిజన్ తీసుకున్నాడు. ఆసుపత్రులో చేర్పించి లక్షల రూపాయలు అప్పులు చేసి చికిత్స అందించినప్పటికీ, బ్రతికాడు కానీ కదలలేడు, మెదలలేడు, ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఎదిగిన కొడుకు జీవచ్ఛవంలా ఇంట్లో ఉండడంతో, ఆ తల్లిదండ్రులు అనుభవించిన ఆవేదన అంతాఇంతా కాదనే చెప్పాలి.

Also Read : బస్సు కోసం విద్యార్థుల బాధలు… రోడ్ల మీద వాహనాలను ఆపుతూ ఇబ్బందులు

తల్లిదండ్రులతో పాటు తన భర్త మెరుగైన చికిత్స కోసం, ఉన్న అరఎకరం భూమి అమ్మింది భార్య నర్మద. తనకున్న ఇద్దరు చిన్న పిల్లలతో పాటు జీవచ్ఛవంలా మారిన భర్తకు సేవ చేస్తూ, కూలీ పని చేసుకుంటూ జీవనం వెలదీస్తోంది. జూన్ 27న గ్రామసమస్యలు తెలుసుకోవడానికి, నేరుగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి యరుగండ్లపల్లి గ్రామానికి, మార్నింగ్ వాక్ కి వెళ్లిన, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దృష్టికి, తిరుపతయ్య పడుతున్న ఇబ్బందిని వారి కుటుంబం పడుతున్న, ఆవేదనను స్థానిక నాయకులు తీసుకెళ్లారు.

ఆ రోజే తిరుపతయ్య తిరిగి నయం అవ్వడానికి, తనవంతు ప్రయత్నం చేస్తానని, మాట ఇస్తూనే ధైర్యం కోల్పోవద్దని, మీకు నేనున్నానన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం గురువారం హైదరాబాదులోని, యశోద ఆసుపత్రిలో తిరుపతయ్యకు చికిత్స చేయిస్తున్నారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశంతో, యరుగండ్లపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, తిరుపతయ్యను యశోద ఆసుపత్రికి తీసుకెళ్లడంతో చికిత్స ప్రారంభించారు డాక్టర్లు. తిరుపతయ్య తిరిగి కోలుకోవడానికి మానవ ప్రయత్నంగా తనవంతు సహకారం అందిస్తానని, ఇచ్చిన మాట ప్రకారం తిరుపతయ్యకు చికిత్స చేయిస్తుండడంతో, కుటుంబ సభ్యులకు ధైర్యం వచ్చినట్లయింది. రాజన్న చేస్తున్న ప్రజా సేవకు ప్రజలు జేజేలు కొడుతున్నారు. పదవిని సైతం మునుగోడు ప్రజలకోసం, త్యాగం చేసిన చరిత్ర కలిగిన కోమటిరెడ్డికి, మంత్రి పదవి ఇస్తే, ఫ్లోరోసిస్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజన్న త్యాగాన్ని గుర్తించాలని కోరుతున్నారు.

Also Reads …

  1. తీరిన రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ… హంద్రీనీవా ఫేజ్‌-1 పంపింగ్‌ షురూ

  2. బీఆర్‌ఎస్‌కు కవిత షాక్‌… బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్‌ఎస్‌ వైఖరిపై గరం గరం

  3. కాల్పులు జరిపిన గన్ మెన్సును వెంటనే డిస్మిస్ చేయాలి: కవిత

  4. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం… త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button