![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/IMG-20250210-WA0017-720x470.jpg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరిగే మహా కుంభమేళ ఉత్సవాలలో పాల్గొన్నారు. కాషాయ వస్త్రాలు ధరించి అతని కుటుంబంతో పాటు అందరూ కూడా పుణ్యస్నానాలను ఆచరించారు. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ తన తర్వాతి సినిమా పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్ మరియు ప్రచారాలు జోరుగా జరుగుతుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి ప్రయోగరాజులు జరుగుతున్న కుంభమేళాలు పాల్గొని పుణ్యా స్నానాలు చేసినటువంటి ఫొటోస్ అనేవి ప్రస్తుతం నెట్టింట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అరవింద్ కేజ్రివాల్ ఓడిపోవడానికి ఇదే ముఖ్య కారణం: ఎన్నికల వ్యూహకర్త
మహా కుంభమేళాలో దర్శనమిచ్చిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఒక ప్రత్యేకమైన లుక్ లో కనిపించాడు. సంవత్సరం నుంచి ఎవరికి కనిపించకుండా తన జుట్టును టోపీ తో కవర్ చేసుకున్న దేవరకొండ ఎక్కడికి వెళ్లినా కూడా అంతగా జుట్టును కనిపించనివ్వలేదు. అయితే తాజాగా మహ కుంభమేళాలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా టోపీ తీసి కనిపించారు. అంతేకాకుండా విజయ్ బోల్డ్ లుక్ చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఇందులో తన బాడీని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ లుక్ మొత్తం తన నెక్స్ట్ సినిమాలో భాగంగా అలా తయారయ్యాడు ఉన్నట్లుగా కనిపిస్తుంది.